Double Ismart : డబుల్ ఇస్మార్ట్.. 85 సెకన్ల టీజర్

ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ (Smart Shankar) చిత్రానికి సీక్వెల్‌గా, డబుల్ డోస్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నాడు పూరి. దీంతో.. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2024 | 10:40 AMLast Updated on: May 15, 2024 | 10:59 AM

Double Smart 85 Second Teaser

 

 

 

ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ (Smart Shankar) చిత్రానికి సీక్వెల్‌గా, డబుల్ డోస్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నాడు పూరి. దీంతో.. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మే 15 వ తేదీన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రామ్ బర్త్ డే (Ram’s birthday) సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ టీజర్‌కు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ టీజర్ రన్ టైం 85 సెకన్లు అని తెలిపారు. ఈ టీజర్ పక్కా రామ్ పోతినేని (Ram Pothineni) మ్యాడ్ నెస్‌తో ఉంటుందని అన్నారు. దీంతో.. ఇస్మార్ట్ శంకర్‌ (Smart Shankar) కు మించిన మాస్ డోస్ ఈ సినిమాతో ఇవ్వడానికి పూరి, రామ్ ప్లాన్ చేస్తున్నారనే చెప్పాలి. రామ్ ఫ్యాన్స్‌కు ఏదైతే కావాలో.. అది డబుల్ ఇస్మార్ట్‌లో ఉంటుందని అంటున్నారు. ఈ 85 సెకన్ల టీజర్ ఖచ్చితంగా సినిమా బిజినెస్‌కు కలిసొస్తుందని.. అలాగే సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.

లైగర్ (Ligar) ఫ్లాప్‌ తర్వాత పూరి, ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరో హిట్ అందుకోలేకపోయిన రామ్‌కు ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకంగా మారింది. ఖచ్చింగా ఈ ఇద్దరు డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి డబుల్ ఇస్మార్ట్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.