డ్రాగన్ AI బడ్జెట్ 150 కోట్లు… సూపర్ స్టార్ కంటే ముందే సెన్సేషన్…
దిల్ రాజు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ స్టూడియోని స్టార్ట్ చేయబోతున్నాడు. కారణం మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబునే.. వీల్ల వల్లే తను ఆల్రెడీ ఉన్న వెంకటేశ్వర బ్యానర్ కాకుండా ఏఐ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాడు.

దిల్ రాజు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ స్టూడియోని స్టార్ట్ చేయబోతున్నాడు. కారణం మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబునే.. వీల్ల వల్లే తను ఆల్రెడీ ఉన్న వెంకటేశ్వర బ్యానర్ కాకుండా ఏఐ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాడు. అది కూడా 100 కోట్ల ఖర్చుతో… ఏకంగా హాలీవుడ్ స్టూడియోలకి సపోర్ట్ చేస్తే ఏఐ కంపెనీతో టై అప్ అయ్యాడు. దీనంతటికీ ఎన్టీఆర్, మహేశ్ బాబుకి ఉన్న లింకే షాకింగ్ గా మారింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో ఆర్టీఫీషియల్ ఇంటెలీజెన్స్ వాడుతున్నారు… అందుకోసం ఏకంగా 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ సినిమా కోసం ఏకంగా 350 కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ కి ఖర్చు చేస్తుంటే, అందులో 300 కోట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కే ఖర్చుచేస్తారట. ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా ట్రెండ్ నే మార్చేలా ఉన్నాయి. ఫైనల్ గా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల కూడా దిల్ రాజు ఏఐ స్టూడియోకి రెడీ అయ్యాడు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తో వందలకోట్లు లాసైనా, ఇంత రిస్క్ చేసి 100 కోట్ల ఏఐ స్టూడియోకి రెడీ అవటం వెనక సాలిడ్ రీజనుంది… ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాల వల్లే దిల్ రాజుకో కొత్త దారి దొరికింది.. అదేంటో చూసేయండి.
బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, 35 ఎమ్ ఎమ్ నుంచి ఐమ్యాక్స్ వర్షన్ వరకు సినిమా స్ట్రాండర్స్ మారిపోయాయి. మామూలు టెక్నిక్స్ నుంచి కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే ప్రపంచాన్ని రీక్రియేట్ చేసేంతగా సినిమా ఎదిగింది. ఇప్పుడు సీన్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వచ్చింది. దాంతోనే డ్రాగన్, ఎస్ ఎస్ ఎమ్ బీ 29 లాంటి సినిమాలు పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడి చేయబోతున్నాయి.ఇంతవరకు ప్రశాంత్ నీల్ కాని, రాజమౌళి కాని వాళ్లు తీస్తున్న సినిమాల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నట్టు ఎనౌన్స్ చేయలేదు. అసలు లాంచింగే సైలెంట్ గా కానిచ్చేశారు.. ఇంకా డిటేల్స్ బయటికిరానిస్తారా..? కాని చాలా లీకులతో కొన్ని విషయాలు తేలాయి. డ్రాగన్, ఎస్ ఎస్ ఎమ్ 29లో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో గ్రాఫిక్స్ వర్క్ జరగబోతోంది..
ఈ విషయం అఫీషియల్ గా బయటికి రాలేదు. కాని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త ఏఐ స్టూడియో పుణ్యమాని డ్రాగన్ లో 150 కోట్ల ఏఐ గ్రాఫిక్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ లో 300 కోట్ల ఖర్చుతో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో గ్రాఫిక్స్ ప్లాన్ చేశారని తేలింది. మే 4న దిల్ రాజు ఏఐ స్టూడియో షురూ కాబోతోంది. ఐతే డ్రాగన్, ఎస్ ఎస్ ఎంబీ 29 మూవీల వల్లే దిల్ రాజు ఇలా ఏఐ స్టూడియో పెట్టాల్సి వచ్చిందట. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు వల్లే దిల్ రాజు ఏకంగా 100 కోట్ల ఖర్చుతో హాలీవుడ్ కి ఏఐ టెక్నాలజీ సపోర్ట్ చేసే క్వాంటం గ్లోబల్ ఏఐ తో టై అప్ అయ్యాడు.
దీనంతటీకి రీజన్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ చేస్తున్న డ్రాగన్ లో గ్రాఫిక్స్ వర్క్ క్వాలిటీ కోసం ఏఐ టెక్నాలజీ వాడుతున్నారు. 300 కోట్ల ఖర్చుతో ఇదే టెక్నాలజీని విజువల్ ఎఫెక్ట్స్ కోసం వాడుతున్నారు. వీటికోసం ఎక్కడికో వెళ్లే కంటే హైద్రబాద్ లోనే ఓ స్పెషల్ ఏఐ స్టూడియో ఉంటే ఎలా ఉంటుందనేది తారక్ ఐడియా అని తెలుస్తోంది. బాహుబలి, త్రిబుల్ ఆర్ గ్రాఫిక్స్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా జరిగినా, 70పర్సెంట్ పని, సూపర్ విజన్ మాత్రం ఇక్కడి నుంచే జరిగింది. సో అలానే డ్రాగన్ గ్రాఫిక్స్ కోసం ఎక్కడికో వెళ్లేకంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయం తో ఇక్కడే ఓ సెటప్ రెడీ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ జరిగిందట. సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ కూడా ఇటు వైపు ఆలోచించినా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ విషయంలో రాజమౌళి కూడా ఎన్టీఆర్ నిర్ణయానికే ఓటేశాడు.. దీంతో ఈ రెండు సినిమాల వర్క్స్ దిల్ రాజు కొత్త ఏఐ స్టూడియోకి దక్కే ఛాన్స్ఉంది. సో రెండు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టే, 500 కోట్ల గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత కూడా 100 కోట్ల పెట్టి ఓ ఏఐ స్టూడియో సెటప్ రెడీ చేస్తున్నాడు దిల్ రాజు… ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన టాక్.