డ్రాగన్ బడ్జెట్ మైండ్ బ్లాంక్… ఓటీటీ రైట్సే 300 కోట్లు…
దేవరగా మ్యాన్ ఆఫ్ మాసెస్ దుమ్ముదులిపాడు. ఇంకా రిలీజై మూడు వారాలు దాటినా, పాన్ ఇండియా లెవల్లో మాస్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అంతా బానే ఉంది. కాని తను కొత్త సినిమా ఇంతకుమించేలా హైప్ క్రియేట్ చేస్తోంది. సెన్సేషన్ గా మారుతోంది.
దేవరగా మ్యాన్ ఆఫ్ మాసెస్ దుమ్ముదులిపాడు. ఇంకా రిలీజై మూడు వారాలు దాటినా, పాన్ ఇండియా లెవల్లో మాస్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అంతా బానే ఉంది. కాని తను కొత్త సినిమా ఇంతకుమించేలా హైప్ క్రియేట్ చేస్తోంది. సెన్సేషన్ గా మారుతోంది. కేజీయఫ్, సలార్ లాంటి పాన్ ఇండియా మూవీలతో బాక్సాఫీస్ ని పీస్ పీస్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ని డ్రాగన్ గా మారుస్తున్నాడు. ఆల్రెడీ లాంచైన ఈ సినిమా తాలూకు, రెగ్యులర్ షూటింగ్ మాత్రం షురూ కాలేదు. ఇంతలోనే ఓటీటీ రైట్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. ఆల్రెడీ దేవర సునామీతో బాలీవుడ్ హీరోలు షేక్ అవుతున్నారు. అలాంటిది, ఇప్పుడు ఇంకా రెగ్యులర్ షూటింగే జరగని సినిమా ఓటీటీ రైట్స్ రూపంలో, బాలీవుడ్ హీరోలను వెక్కిరిస్తే తట్టుకుంటారా? ఎన్టీఆర్ డ్రాగన్ ఓటీటీ రైట్సే, బాలీవుడ్ స్టార్ హీరో హిందీ మార్కెట్ నిమించిందంటే, ఇదొక్కటి చాలు హిందీ హీరోలు కుల్లుకుచావటానికి… అదేజరుగుతోంది. 300 కోట్ల డ్రాగన్ రికార్డేంటో చూసేయండి…
ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో 1200 కోట్ల వసూళ్ళు రుచి చూశాడు. దేవరతో 550 కోట్ల షేర్ వసూళ్లు, 1090 కోట్ల గ్లాస్ కలెక్షన్స్ తో చరిత్ర స్రుష్టించాడు. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసిన మొదటి పాన్ ఇండియా హీరోగా, ప్రభాస్, రామ్ చరణ్ ని మించాడు. అంతవరకు ఓకే కాని, ఇప్పుడు బాలీవుడ్ హీరోలే కాదు, సౌత్ స్టార్లు కూడా షాక్ అయ్యే రేంజ్ లోఓటీటీని డామినేట్ చేసేలా ఉన్నాడు
ఎందుకంటే తనతో ప్రశాంత్ నీల్ తీయబోయే డ్రాగన్ మూవీ ఓటీటీ రైట్స్ 300 కోట్లు దాటాయి. ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ సంస్థ డ్రాగన్ రైట్స్ ని ముందే లైన్ లో పెడుతోందట. విచిత్రం ఏంటంటే ప్రశాంత్ నీల్ టీ ఏకంగా ఈ సినిమకు 400 కోట్లు కోట్ చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇంత ఎమౌంట్ కిఓటీటీ రైట్స్ ని కోట్ చేయలేదు.
400 కోట్ల కొటేషన్ సంగతెలా ఉన్నా, నెట్ ఫ్లిక్స్ సంస్థ 300 కోట్లకు డ్రాగన్ రైట్స్ కొనేందుకు సిద్దపడిందంటే, అది కూడా హిస్టారికల్ రికార్డే. విచిత్రం ఏంటేంటే డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీలైతే లాంచ్ చేశాడు. కాని రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు.సో ఇదంతా దేవర ఎఫెక్టే అంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ కాని కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ థౌజెండ్ వాలా పేల్చాడంటే, అది చాలు దేశవ్యాప్తంగా తనకెంతగా మాస్ లో ఇమేజ్ ఉందో చెప్పటానికి. అలాంటి హీరోకి పాన్ ఇండియాని మూడు సార్లు షేక్ చేసిన దర్శకుడు తోడైతే, ఇక బాక్సాఫీస్ బాక్స్ బద్దలే
కేజీయఫ్ , కేజీయఫ్ 2 తో రెండు సార్లు పాన్ ఇండియాని 500 కోట్లు, 1200 కోట్ల వసూల్లతో షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. తర్వాత రెబల్ స్టార్ తోకలిసి సలార్ తీస్తే 750 కోట్లొచ్చాయి. ఇప్పుడు సలార్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. డ్రాగన్ తర్వాతే సలార్ 2 ఉండొచ్చంటున్నారు.సో ఇలాంటి డైరెక్టర్ కి, అలాంటి హీరో తోడైతే, పాన్ ఇండియా పండగే.. కాబట్టే ఓటీటీ సంస్థలు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ కాకముందే పోటీ పడుతున్నాయి. వంద, రెండొందలు కాదు, ఏకంగా 300 కోట్లు కుమ్మరించి ఓటీటీ రైట్స్ ని తీసుకోవటానికి రెడీ అయ్యాయి.
ఇప్పటి వరకు పుష్ప 2 కి 270 కోట్ల ఓటీటీ రైట్స్ డీల్ అయ్యిందంటేనే అంతా షాక్ అయ్యారు. ఆల్రెడీ హిట్ అయిన మూవీకి సీక్వెల్ అవటం, 1000 కోట్లను మించే రేంజ్ ఉన్నమూవీగా భారీ హైప్ ఉండటంతో, అంత ఎమౌంట్ కోట్ చేసిల్లనుకోవాచ్చు. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగెన్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోవట్లేదు. అప్పుడే 300 కోట్లంటే తోటి తెలుగు హీరోలే తట్టుకోలేరు… ఇక హిందీ హీరోలు, తమిళ స్టార్లు ఎన్టీఆర్ క్రేజ్ కి షాక్ లోకి వెళ్లాల్సిందే.