డ్రాగన్ ఆఫ్ మాసెస్.. పెద్ద డ్రాగన్ నెత్తిన పాలు పోసిని బుల్లి డ్రాగన్..

లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ మూవీలతో ప్రదీప్ రంగనాదన్ వరుస హిట్లు సొంతం చేసుకన్నాడు. ఎన్టీఆర్ మూవీకి పెట్టిన డ్రాగన్ టైటిల్ నే వాడి 100 కోట్లు వెనకేసుకున్నాడు. కట్ చేస్తే ఇది బుల్లి డ్రాగన్ అని, అసలు డ్రాగన్ ఇంతకు ఇరవై రెట్లుంటుందని తేల్చాడు నిర్మాత.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2025 | 09:45 PMLast Updated on: Mar 05, 2025 | 9:45 PM

Dragon Of Masses

లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ మూవీలతో ప్రదీప్ రంగనాదన్ వరుస హిట్లు సొంతం చేసుకన్నాడు. ఎన్టీఆర్ మూవీకి పెట్టిన డ్రాగన్ టైటిల్ నే వాడి 100 కోట్లు వెనకేసుకున్నాడు. కట్ చేస్తే ఇది బుల్లి డ్రాగన్ అని, అసలు డ్రాగన్ ఇంతకు ఇరవై రెట్లుంటుందని తేల్చాడు నిర్మాత. మైత్రీ మూవీ మేకర్స్ కి ఎన్టీఆర్ డ్రాగన్ ప్రాజెక్టు ఎంత స్పెషలైనా, వాళ్లే తెలుగులో రిలీజ్ చేసిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ కూడా హిట్ అవటంతో, ఇప్పుడీ పేరు సౌత్ మొత్తం మారుమోగుతోంది. కోలీవుడ్ లో ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ కి ముందే ఆ పేరు అక్కడ జనాల్లోకి దూసుకెళ్లింది. అయితే ఇది మంచి శకునమే అయినా, అంతకు మించే శకునం డ్రాగన్ కి ఎదురౌతోంది. ఇప్పటి వరకు రిటర్న్ ఆఫ్ డ్రాగన్ గా ప్రదీప్ రంగనాథన్, డ్రాగన్ గా ఎన్టీఆరే ఈ పేరుతో మాస్ గేర్ మారుస్తున్నారు. ఐతే మూడో డ్రాగన్ కూడా సీన్ లో కొస్తోంది. అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేలా ఉంది.. ఇంతకి ఆ మూడో డ్రాగన్ ఎవరు? దాంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ కాస్త డ్రాగన్ ఆఫ్ మాసెస్ గా ఎందుకు మారేలా ఉన్నాడు..? హావేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ఎన్టీఆర్ వార్ 2 సాంగ్ షూటింగ్ ని ఈ వారం లో పూర్తి చేసుకుని, మంథ్ ఎండ్ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి డ్రాగన్ గా సెట్ లో అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈ డ్రాగన్ రాకముందే మరో డ్రాగన్ కోలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టింది. మూడో డ్రాగన్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ని ఫేస్ చేయబోతోంది. మొత్తంగా ఈ ఏడాది ఇండియాలో మూడు డ్రాగన్ ల పేర్లు వినిపించడం కన్పామ్ అయ్యింది. అందులో ఎన్టీఆర్ కి ఏమాత్రం డైరెక్ట్ గా సంబంధం లేని డ్రాగన్ అంటే, అది తమిల మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగనే… మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన మూవీ అవటం, 100 కోట్ల వసూళ్లు ఈ సినిమా రాబట్టడంతోనే ఇప్పుడీ సినిమాతో తారక్ కి లింకు సింకైంది.

ఎందుకంటే రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ని తీసింది, ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ని నిర్మించేది మైత్రీ మూవీ మేకర్సే… సో ఒక డ్రాగన్ తమిల్, తెలుగు మార్కెట్లో హిట్టైంది. ఇక ఈ బుల్లి డ్రాగన్ ఎటాక్ తర్వాత పెద్ద డ్రాగన్ గా వచ్చే ఏడాది మీద దాడి చేయబోతున్నాడు తారక్. అదే హై వోల్టేజ్ కంటెంట్ తో రాబోతోంది. ఇండియన్ సినిమాస్ లో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని, చికెన్ నెక్ ని టచ్ చేస్తోంది డ్రాగన్ మూవీ. ఇండియా, భూటాన్, చైనా కి కామన్ గా కలిపే ప్రాంతమైన మన దేశియ ప్రాంతం చికెన్ నెక్ ఏరియా బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ రాబోతోందట. ఇండియన్ ఆర్మీ, చైనీస్ గ్యాంగ్ స్టర్స్, ఈ శాన్య రాష్ట్రాల్లో మాఫియా కలిపి ఈ సినిమాలో కనిపించబోతోంది.

ఇలాంటి మూడు జోనర్లు కలిపి ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ సినిమా తీయలేదు. అందుకే ఈ డ్రాగన్ అంచనాలను మించే లెవల్లో తీస్తున్నామన్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేథల మాటలు వైరలయ్యాయి. ఐతే ఇక్కడ కథ లో మరో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ మూడో డ్రాగన్ కూడా ఉండటం. దేవరలోనే డ్యూయెల్ రోల్ వేసిన తారక్, డ్రాగన్ లో ఏకంగా మూడు పాత్రలు వేస్తున్నాడని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఐతే ఒక పాత్ర తండ్రి అయితే రెండు పాత్రలు మాత్రం కొడుకని ఇప్పడు రివీలైంది. సో ఇద్దరు డ్రాగన్లు కలిసి విలన్ల మీద ఫైట్ చేసే కాన్సెప్ట్ హాలీవుడ్ మూవీ నుంచి ప్రేరణగా తీసుకున్నారట.

హాలీవుడ్ స్టార్ టామ్ హార్డీ తీసిన లెజెండ్ మూవీ ప్రేరణగా డ్రాగన్ లో హీరో పాత్రలు ఉండబోతున్నాయి. ట్విన్ బ్రదర్స్ అయిన ఇద్దరు మాఫియా డాన్స్ ఎలా ఆపోనెంట్స్ తో ఫైట్ చేశారో ఇందులో ఉంటుంది. పూర్తిగా గ్రే షేడ్స్ ఉండే పాత్రలవి… వాటినే ఆధారంగానే డ్రాగన్ లో ఇద్దరు ఎన్టీఆర్ పాత్రలు డిజైన్ చేసి, దానికి ఇండో చైనా, భూటాన్ కాన్సెప్ట్ ని యాడ్ చేశాడట ప్రశాంత్ నీల్. ప్రస్థుతానికి ఇండస్ట్రీ ఇంటర్నల్ టాక్ తో ఈ విషయం లీకైంది… ఇదే నిజమౌతే నిజంగానే కేజీయఫ్, సలార్ ని డ్రాగన్ మించే ఛాన్స్ ఉంది.