500 కోట్లతో భారీ కటౌట్ .. డ్రాగన్ టీం బిగ్ సర్ ప్రైజ్…
డ్రాగన్ పేరు ఇక మీదట మారుమోగబోతోంది. మొన్నటి వరకు సైలెంట్ గా డ్రాగన్ షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్న ప్రశాంత్ నీల్, అసలు సిసలు ఎనౌన్స్ మెంట్ కి రెడీ అయ్యాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమాను లాంచ్ చేశాక, హీరో లేని సీన్లు మాత్రమే తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ కి, ఎన్టీఆర్ నుంచి పూర్తి అప్రూవల్ వచ్చేసింది.
డ్రాగన్ పేరు ఇక మీదట మారుమోగబోతోంది. మొన్నటి వరకు సైలెంట్ గా డ్రాగన్ షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్న ప్రశాంత్ నీల్, అసలు సిసలు ఎనౌన్స్ మెంట్ కి రెడీ అయ్యాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమాను లాంచ్ చేశాక, హీరో లేని సీన్లు మాత్రమే తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ కి, ఎన్టీఆర్ నుంచి పూర్తి అప్రూవల్ వచ్చేసింది. అంతే ఇప్పుడు 500 కోట్ల భారీ కటౌట్ తో, ఎవరూ చేయని సాహసానికి రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్. కేజీయఫ్ రెండు భాగాలు, సలార్ ని మించేలా పాన్ ఇండియా ని సినిమా షూటింగ్ ముందే షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు డిసెంబర్ 25 ముహుర్తాన్ని ఫిక్స్ చేశాడు. అ రోజు భూమి బద్దలయ్యే రేంజ్ సర్ ప్రైజ్ ఉండబోతోంది. ఆల్ మోస్ట్ మీడియాకు హింట్ ఇచ్చిన ఫిల్మ్ టీం, ఈ ఇయర్ఎండ్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించబోతోంది. అదేంటో చూసేయండి.
కేజీయఫ్ తో 500 కోట్లు, కేజీయఫ్ 2 తో 1250 కోట్లు రాబట్టిన రికార్డు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సొంతం. అలానే త్రిబుల్ ఆర్ తో 1350 కోట్లు, దేవరతో 510 కోట్లు రాబట్టిన రికార్డు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సొంతం… అంటే ఆల్ మోస్ట్ అటు డైరెక్టర్, ఇటు హీరో ఇద్దరి రికార్డులు ఒకేలా ఉన్నాయి. అలాంటి వీళ్ల కాంబినేషన్ లో సినిమా అంటేనే సెన్సేషన్. సలార్ టాక్ వీకైనా, అటు ప్రభాస్, ఇటు ప్రశాంత్ నీల్ వల్ల ఈజీగా 750 కోట్లొచ్చాయి. యావరేజ్ టాక్ తో వచ్చినమూవీనే ఇంతగా రాబట్టిందంటే, దర్శకుడు, హీరో కున్న క్రేజ్ వల్లే అని అంతా అన్నారు
అలాంటిది ఎన్టీఆర్ లాంటి కటౌట్ తో ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భూమి బద్దలైపోయే కాంబినేషన్ అనుకోక తప్పదు. అలాంటి కాంబోకి 500 కోట్ల బడ్జెట్ తో భారీ కటౌట్ ని రెడీ చేస్తున్నారు. ఆ కటౌట్ పేరే డ్రాగెన్. ఆల్రెడీ లాంచైన ఈ సినిమా షూటింగ్ జరుుగుతోంది. ఫిబ్రవరి నుంచి హీరో కూడా సెట్ లో జాయిన్ అవబోతున్నాడన్నారు
ఈలోపు హీరోలేని సీన్లు తీస్తున్న ప్రశాంత్ నీల్ టీం, డిసెంబర్ 25కి భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది. వచ్చేనెల క్రిస్మస్ గిఫ్ట్ ని భారీగానే రెడీ చేస్తోంది. రామోజీ రావు స్టూడియోలో భారీ డ్రాగన్ కటౌట్ ని రెడీచేస్తున్నారట. ఇక వచ్చేనెలలోనే ఈ సినిమా టైటిల్ ని ఎనౌన్స్ చేయబోతున్నారట
అంతే కాదు డ్రాగన్ 2025 దసరాకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇవే విషయాన్ని అఫీషియల్ గా డిసెంబర్ 25న ఎనౌన్స్ చేసేందుకు రంగం సిద్దమైంది. టోటల్ స్టార్ కాస్ట్ అండ్ క్రూ ని కూడా ఎనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని, టైటిల్ ని, లాంచ్ చేసేందుకు క్రిస్మస్ అకేషన్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది
ఆల్రెడీ ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని అన్ అఫీషియల్ గా నే జనాలకు చేరింది. కాకపోతే అఫీషియల్ గా వచ్చేనెలే ఎనౌన్స్ చేయబోతున్నారు. అది కూడా 100 అడుగుల డ్రాగన్ కటౌట్ కి ఎన్టీఆర్ లుక్ ని యాడ్ చేసి మరి అని తెలుస్తోంది. సో వచ్చే ఏడాదిని టార్గెట్ చేసిన డ్రాగన్ ని ఇలా ఈ ఏడాది నుంచే ప్రమోషన్ షురూ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.