డ్రగ్స్ స్మగ్లింగ్ వివాదం… మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మచ్చ…

డ్రగ్స్ పేరు వింటేనే సౌత్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఓసారి టాలీవుడ్ ని డ్రగ్స్ కేసు భయపెట్టింది. తర్వాత మాలీవుడ్, శాండిల్ వుడ్ లో ఇదే తేనె తుట్టేని కదిపారు. బాలీవుడ్ లో అయితే ఏకంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసుతో నరకం అనుభవించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2025 | 04:29 PMLast Updated on: Jan 09, 2025 | 4:29 PM

Drug Smuggling Controversy A Stain On The Man Of The Masses

డ్రగ్స్ పేరు వింటేనే సౌత్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఓసారి టాలీవుడ్ ని డ్రగ్స్ కేసు భయపెట్టింది. తర్వాత మాలీవుడ్, శాండిల్ వుడ్ లో ఇదే తేనె తుట్టేని కదిపారు. బాలీవుడ్ లో అయితే ఏకంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసుతో నరకం అనుభవించాడు. అందుకే డ్రగ్స్ అన్న మాట వస్తే సినీ జనాలు ఉలిక్కి పడతారు. కొందరు తప్పుచేయొచ్చు, చేయకపోవచ్చు… కానీ ఏదో కారణంతో తమ పేరు అందులో వినిపిస్తే, నిజా నిజాలు బయటికొచ్చేలోపు, సోషల్ మీడియాలో క్యారెక్టర్ ని ఖతం చేస్తారు. అందుకే డ్రగ్స్ అన్న పదమే సినీ జనాల్లో వణుకు తెప్పిస్తుంది. కాని ఇప్పుడు వినిపిస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ అన్న మాట అలాంటిది కాదు… కాసులు కురిపించే పాయింట్… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ జోనర్… మొన్న కేజీయఫ్ లో బంగారం స్మగ్లింత్ తో పాన్ ఇండియా షేకైంది. నిన్న ఎర్ర చందనం చెక్కల స్మగ్లింగ్ తో నార్త్ ఇండియా షేక్ అయ్యింది. ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ తో కోట్లు సునామీ రాబోతోందా? ఎన్టీఆర్ ని ఫస్ట్ టైం డ్రగ్స్ డాన్ గా చూడబోతున్నామా?

డ్రగ్స్ అంటేనే హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్స్ అంతా భయపడాలి. అలాంటి కేసులు, అలాంటి పరిస్థితులు తెలుగు స్టార్స్ నుంచి బాలీవుడ్ హీరోల వరకు అంతా ఫేస్ చేశారు. కాని ఇప్పుడు డ్రగ్స్ మాఫియాతో కోట్లు కొల్లగొట్టేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఇది నిజంగా నిజం… కాకపోతే సినిమా రూపంలో డ్రగ్ స్లగ్మింగ్ కి రెడీ అయ్యాడు ఎన్టీఆర్

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కమిటైన డ్రాగన్ మూవీ అంతా డ్రగ్ స్మగ్లింగ్ మీదే ప్లాన్ చేశారట. ఇందులో ఎన్టీఆర్ మాఫియా వరల్డ్ లో డాన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ తన పాన్ ఇండియా హిట్ మూవీ కేజీయఫ్ లో రాఖీ భాయ్ ని గోల్డ్ స్మగ్లర్ గా చూపించాడు

1300 కోట్లు కొల్లగొట్టాడు. తర్వాత సలార్ లో ఊహాజనితమైన ప్రపంచానికి మాఫియా డాన్ గా ప్రభాస్ ని చూపించాడు. రీసెంట్ పుష్ప2లో బన్నీ కూడా స్మగ్లింగ్ డాన్ గా నే కనిపించాడు. కాకపోతే ఎర్ర చందనం చెక్కల స్మగ్లర్ గా బాక్సాఫీస్ ని షేక్ చేశాడు

మొత్తంగా ఏదో ఒక స్మగ్లింగ్ జోనర్ లోనే హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఉంది. కాకపోతే బంగారం స్మగ్లింగ్ ఇష్యూ కాదు… ఎర్ర చెందనం స్మగ్లింగ్ ఇష్యూ కాదు.. కాని డ్రగ్స్ స్మగ్లింగ్ కాన్సెప్టే ఇష్యూ అయ్యేలా ఉంది. ఎర్ర చందంన స్మగ్లర్ హీరో ఏంటనే వందలకొద్ది కామెంట్ చేశారు. అయినా బాక్సాఫీస్ లో వసూల్ల వరద ఆగలేదు.

అది జస్ట్ సినిమా కాబట్టి, సినిమాలానే చూడాలనే అభిప్రాయముంది.. ఐతే డ్రాగన్ లో మలయాళ స్టార్స్ అయిన జోజు జార్జ్, టివినో థామస్ లు విలన్లుగా కన్ఫామ్ అయ్యారు. కన్నడ లేడీ రుక్మిణీ వసంత్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు.

స్టోరీ లైన్ కూడా, థాయ్ లాండ్, మయన్మార్, లావోస్ చుట్టూనే తిరుగుతుందట. ఈ మూడు దేశాళ్లో జరిగే డ్రగ్ స్మగ్లింగ్ నే గోల్డెన్ ట్రాయాంగిల్ అంటారు. నైంటీస్ ఫిఫ్టీస్ నుంచే ఈ పేరు వాడుకలో ఉంది. అలాంటి ఈ గోల్డెన్ ట్రాయాంగిల్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట

చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ అయ్యేలా, అక్కడి స్టార్స్ ని కూడా తీసుకుంటున్నారని ప్రచారం అయితే జరిగింది. ఏదేమైనా ఇక్కడ విచిత్రం ఏంటంటే, గోల్డ్, ఎర్ర చందనం స్మగ్లింగ్ తర్వాత డ్రగ్స్ ని ఎవరూ టచ్ చేయరనుకుంటే, దాన్ని ఎన్టీఆర్ టచ్ చేశాడు. తను బాలీవుడ్ మూవీ వార్ 2 లో విలన్ గా నటిస్తుంటే, తన డ్రాగన్ మూవీలో మలయాళ హీరోలైన టోవినో థామస్, జోజు జార్జ్ విలన్లుగా చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో విచిత్రాలకు డ్రాగన్ మూవీ కేరాఫ్ అడ్రస్ అయినా, డ్రగ్స్ డాన్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడనే మాటే కాస్త ఇబ్బంది కరంగా మారేలా ఉంది. కాకపోతే డ్రగ్స్ స్మగ్లింగ్ తాలూకు మాఫియా జోనరే అయినంత మాత్రాన హీరోనే డ్రగ్స్ డాన్ అని ఎవరూ కన్పామ్ చేయలేదు. సో సంక్రాంతి తర్వాత స్పెషల్ ఎనౌన్స్ మెంట్ ఉండే ఛాన్స్ ఉండటంతో, స్టార్ కాస్ట్ డిటేల్స్ తో పాటు జోనర్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది.