Dubbing Movies : టాలీవుడ్‌లో మళ్లీ డబ్బింగ్ హవా..
తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. కథ కత్తిలా ఉంటే డైరెక్టర్ ఎవరు.. హీరో ఎవరు అనేది కూడా చూడరు తెలుగు ప్రేక్షకులు. అందుకే తమిళ్‌లో హిట్ అయిన సినిమాలు టాలీవుడ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ హీరోలకు కూడా తెలుగు మార్కెట్ కామధేనువుగా మారింది. టాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది.
తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. కథ కత్తిలా ఉంటే డైరెక్టర్ ఎవరు.. హీరో ఎవరు అనేది కూడా చూడరు తెలుగు ప్రేక్షకులు. అందుకే తమిళ్‌లో హిట్ అయిన సినిమాలు టాలీవుడ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ హీరోలకు కూడా తెలుగు మార్కెట్ కామధేనువుగా మారింది. టాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ప్రతీ ప్రాజెక్ట్ 50కోట్లకు పైగా వసూళ్లని రాబడుతోంది. దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ జైలర్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తలైవా థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్, మోహన్‌లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్ అప్పియరెన్స్, అనిరుధ్ BGM.. వెరసి అన్ని ఇండస్ట్రీ వర్గాల ప్రేక్షకుల్ని ఫిదా చేశాయి.
ఇక షారుఖ్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ జవాన్. సెప్టెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ ప్రాజెక్ట్.. వాల్డ్ వైడ్‌గా వెయ్యి కోట్లు రాబట్టింది. దీని కంటే ముందు వచ్చిన పఠాన్ కూడా బాక్సాఫీస్ దగ్గర థౌజంన్ వాలా పేల్చింది. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. 60 నుంచి 70 కోట్ల వరకు బాద్‌షా కొల్లగొట్టినట్లు బీటౌన్ వర్గాలు చెప్తున్నాయి. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీర్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ యానిమల్. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ ప్రాజెక్ట్.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. 100కోట్లు పక్కా అనే కామెంట్స్ ట్రాడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే తమిళ్ హీరోలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేస్తున్నారు.