DUBBING MOVIES: టాలీవుడ్‌ను వణికిస్తున్న డబ్బింగ్ సినిమాలు..?
పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ సొంతం చేసుకునేందుకు దేశాన్ని మన సినిమా చుట్టేస్తుంటే.. లోకల్ మార్కెట్‌ని తమిళ, కన్నడ, ఇంగ్లీష్ మూవీలు కబ్జా చేసేస్తున్నాయి. ఐదేళ్లుగా ఇదే జరుగుతోంది. కానీ, ఇప్పుడిప్పుడే ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
DUBBING MOVIES: టాలీవుడ్ వెలిగిపోతోంది. దేశమంతటా మన సినిమాలే దుమ్ముదులుపుతున్నాయి అనుకునేలోపు.. ఓ చేదు నిజం తెలుగు సినీ జనాన్ని వణికించేలా ఉంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమానే సత్తా చాటుతోందనుకుంటుంటే.. అదేం లేదు తెలుగు మార్కెట్‌ని పొరుగు సినిమాలు కబ్జా చేస్తున్నాయనే నిజం బయట పడింది. ఇది నిజమే. పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ సొంతం చేసుకునేందుకు దేశాన్ని మన సినిమా చుట్టేస్తుంటే.. లోకల్ మార్కెట్‌ని తమిళ, కన్నడ, ఇంగ్లీష్ మూవీలు కబ్జా చేసేస్తున్నాయి. ఐదేళ్లుగా ఇదే జరుగుతోంది.
FIGHTER Vs TOXIC: ఫైటర్ మూవీని మింగేసిన కన్నడ మూవీ టాక్సిక్
కానీ, ఇప్పుడిప్పుడే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. పుష్ప.. దేశ వ్యాప్తంగా దుమ్ముదులిపింది. కాని తమిళనాడులో, కర్ణాటకలో, కేరళ మార్కెట్స్‌లో మాత్రం రూ.50 కోట్లలోపే వసూళ్లొచ్చాయి. ఒక్క బాహుబలి 2 మాత్రమే తమిళ నాట రూ.50 కోట్లకుపైగా వసూళ్లని దాటింది. కన్నడ, కేరళతోపాటు హిందీలో కూడా హాఫ్ సెంచరీలు, సెంచరీలు దాటేసింది. ఇలా ఒకటి రెండు పక్కన పెడితే, టాలీవుడ్‌లో రూ.50 కోట్లు రాబట్టిన సినిమాల లిస్ట్ అరడజన్ దాటింది. అదే ఇక్కడి ఫిల్మ్ మేకర్స్‌ని కంగారు పెట్టిస్తోంది. కేజీయఫ్ 2, కాంతార.. ఈ రెండూ కూడా తెలుగు మార్కెట్లో రూ.50 కోట్లు రాబట్టిన సినిమాలుగా నిలిచాయి. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ అవతార్ 2 కూడా హాఫ్ సెంచరీ కొట్టింది. ఇలా 5 ఏళ్లలో ఆరు సినిమాలు హాఫ్ సెంచరీ వసూళ్లతో షాక్ ఇచ్చాయి.
రజీనీ కాంత్ మూవీ జైలర్, షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ కూడా తెలుగు మార్కెట్లో రూ.50 కోట్లు రాబట్టిన సినిమాలే. తాజాగా యానిమల్ తెలుగు మార్కెట్‌లో 50 కోట్లు రాబట్టింది. తెలుగు రైట్స్ రూ.15 కోట్లకు సేల్ అయితే రూ.50 కోట్ల వసూళ్లొచ్చాయి అంటే మూడు రెట్లపైనే వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. తీసింది తెలుగు దర్శకుడే అయినా, బాలీవుడ్ మూవీనే కాబట్టి ఆ కోణంలో చూస్తే ఐదేళ్లలో రూ.50 కోట్లు రాబట్టిన డబ్బింగ్ మూవీస్‌గా ఆరు మూవీలు ట్రెండ్ సెట్ చేశాయి. లోకల్ మార్కెట్‌ని పొరుగింటి సినిమాలు మెల్లిగా కబ్జా చేస్తున్నాయి.