DUNKI REVIEW: ‘డంకీ’ యావరేజ్.. ‘సలార్’ సునామి ఖాయం

డంకీ సినిమాకు సోషల్ మీడియాలో ఆడియన్స్ నుండి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. షారుక్‌ ఖాన్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందని కొంతమంది అంటుంటే.. మరికొందరేమో యావరేజ్‌ అని కామెంట్స్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 03:59 PMLast Updated on: Dec 21, 2023 | 3:59 PM

Dunki Review Sharukh Khan Movie Got Mixed Responce From Audience

DUNKI REVIEW: బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుక్‌ఖాన్‌, స్టార్ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరాణి కాంబోలో వచ్చిన ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ డంకీ. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బొమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

Bigg Boss Winner, Prashanth Arrested : బిగ్ బాస్ విజేతకు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలులో పల్లవి ప్రశాంత్

పఠాన్‌, జవాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్స్ తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో డంకీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేయగా.. డంకీ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో, డంకీ సినిమాకు సోషల్ మీడియాలో ఆడియన్స్ నుండి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. షారుక్‌ ఖాన్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందని కొంతమంది అంటుంటే.. మరికొందరేమో యావరేజ్‌ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో 2 గంటల 40 నిమిషాల పాటు సినిమాను భరించడం చాలా కష్టమని చెప్తున్నారు.

కథాకథనాలు బాగానే ఉన్నా వాటిని ప్రెజెంట్ చేసిన విధానం చాలా స్లోగా ఉందని అంటున్నారు ఆడియన్స్. మరోపక్క.. డంకీ మెగా బ్లాక్ బస్టర్ అని, షారుఖ్ నటన టాప్ నాచ్ అని, భావోద్వేగాలతో హృదయాలను కట్టిపడేశారని, మాస్టర్ పీస్ మూవీ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ మిక్సుడ్ టాక్ సలార్ సినిమా మీద పాజిటివ్‌గా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. సలార్ కొంచెం కనెక్ట్ అయినా కూడా, డంకీ మూవీకి కష్టాలు తప్పవు అని సినీ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.