Dunki VS Salaar: డంకీని, సలార్‌ని జంతువే మింగేస్తుందా..?

డంకీ విషయానికొస్తే పటాన్, జవాన్ హిట్టయ్యాయని షారుఖ్ హ్యాట్రిక్ కొడతాడనే పరిస్థితి లేదు. ఎందుకంటే డంకీ కంటెంట్ మరీ ఔట్ డేటెడ్‌గా ఉన్నాయి. పాత్రలు, వాళ్ల ఓవరాక్టింగ్ అంతా పదేళ్ల క్రితం మూవీలా ఉందని, అంత ఎఫెక్టివ్‌గా లేవని అంటున్నారు. కేవలం ట్రైలర్‌ను చూసి ఓ అంచనాకు రాకూడదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2023 | 06:49 PMLast Updated on: Dec 07, 2023 | 6:49 PM

Dunki Vs Salaar Animal Movie Is Big Threat To Dunki And Salaar

Dunki VS Salaar: డంకీ మూవీ మీద కొత్తగా కామెంట్లు పెరిగాయి. ట్రైలర్ మరీ వీక్‌గా ఉంది. పట్టించుకునే నాధుడే లేడంటున్నారు. పాటలు పేలట్లేదు. ఇక ఈ సినిమానే కాదు.. సలార్ మూవీని కూడా రణ్ బీర్ కపూర్ మూవీ యానిమల్ మింగేసేలా ఉందనే మాటే వినిపిస్తోంది. డంకీ విషయానికొస్తే పటాన్, జవాన్ హిట్టయ్యాయని షారుఖ్ హ్యాట్రిక్ కొడతాడనే పరిస్థితి లేదు. ఎందుకంటే డంకీ కంటెంట్ మరీ ఔట్ డేటెడ్‌గా ఉన్నాయి. పాత్రలు, వాళ్ల ఓవరాక్టింగ్ అంతా పదేళ్ల క్రితం మూవీలా ఉందని, అంత ఎఫెక్టివ్‌గా లేవని అంటున్నారు.

SALAAR: సలార్‌ని కాపాడేది కేజీఎఫ్‌3 యేనా..?

కేవలం ట్రైలర్‌ను చూసి ఓ అంచనాకు రాకూడదు. కానీ, షారుఖ్ మరీ ముసలివాడిలా డంకీలో కనిపించటం చూస్తే.. గ్రాఫిక్స్‌తో వాళ్లు చేసిన మ్యాజిక్కులేం పనిచేయలేదనే కామెంట్లే పెరిగాయి. ఇక సలార్ విషయానికొస్తే.. ట్రైలర్ పేలలేదు. సలార్ రెండో ప్రోమో వస్తే తప్ప ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితి ఉండదు. ఏదేమైనా యానిమల్ రూ.520 కోట్లు రాబట్టిన ఓ ప్లాప్ మూవీ. లేదంటే హిట్ అయిన వెంటనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఓ క‌న్‌ఫ్యూజడ్ కహానీ.

ఇది ఇలా ఈ కన్‌ఫ్యూజన్‌లోనే వారానికో రెండొందల కోట్లు రాబడితే.. సలార్, డంకీ దుకాణం క్లోజ్ చేయాల్సిందే అంటున్నారు. మెల్లిగా యానిమల్ జనానికి ఎక్కటం షారుఖ్, ప్రభాస్ సినిమాలకు ప్రమాదమే అని తేల్చేస్తున్నారు.