SALAAR: సలార్ మీద యాంటీఫ్యాన్స్, నార్త్ బ్యాచ్ కుట్రలు..?
ఆల్రెడీ సోషల్ మీడియాలో సలార్ మీద నెగెటివ్ వార్తలు, కన్నడ మూవీ ఉగ్రంకి రీమేక్ అంటూ పుకార్లు క్రియేట్ చేస్తోంది కొందరు షారుఖ్ ఫ్యాన్సే అంటున్నారు. ఇక వాళ్లకి ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ తోడయ్యారు. ఏదోలా సలార్ హైప్ తగ్గేలా చేయటమే పనిగా పెట్టుకున్నట్టున్నారు.
SALAAR: షారుఖ్ మూవీ డంకీతో డిసెంబర్ 22న సలార్ పోటీ పడబోతోందన్నప్పటి నుంచి ప్రభాస్ సినిమాకు ఎలా బ్రేకులేయాలనే పనిమీదే ఉంది ఓ బ్యాచ్. అందులో షారుఖ్ ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే, బాహుబలిని ప్రమోట్ చేసిన పెన్ స్టూడియోస్‌తోపాటు బాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌజ్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా ప్రభాస్ మూవీ మీద థియేటర్ల రూపంలో దాడి చేసేలా ఉందట. ఆల్రెడీ సోషల్ మీడియాలో సలార్ మీద నెగెటివ్ వార్తలు, కన్నడ మూవీ ఉగ్రంకి రీమేక్ అంటూ పుకార్లు క్రియేట్ చేస్తోంది కొందరు షారుఖ్ ఫ్యాన్సే అంటున్నారు.
ఇక వాళ్లకి ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ తోడయ్యారు. ఏదోలా సలార్ హైప్ తగ్గేలా చేయటమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. అసలు గొడవ ఎక్కడంటే థియేటర్ల పంపకాల దగ్గరే. సలార్‌కి ఉన్న క్రేజ్ ప్రకారం ఈ సినిమాకే 60శాతం థియేటర్లు రావాలనేది సలార్ టీం డిమాండ్. కానీ, ఏడాది క్రితమే డంకీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవటంతో, షారుఖ్ మూవీకే డిసెంబర్ 22 మీద సర్వ హక్కలుున్నాయంటున్నారట డంకీ హిందీ డిస్ట్రిబ్యూటర్లు. ఒక రకంగా డంకీ డిస్ట్రిబ్యూటర్ల వాదన కరెక్ట్. అలానే జవాన్, పటాన్‌తో షారుఖ్ రెండుసార్లు రూ.1000 కోట్లు రాబట్టిన రికార్డు ఉంది. దీనికితోడు రాజ్‌కుమార్ హిరానీ మేకింగ్‌లో వస్తోంది కాబట్టి డంకీకే మొదటి ప్రయారిటీ ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కాని ఇదే షారుఖ్ మూవీ జీరో వచ్చినప్పుడే కేజీయఫ్ రిలీజ్ చేసి ప్రశాంత్ నీల్ ట్రెండ్ సెట్ చేశాడు.
ఆ కోణంలో, అలానే ప్రభాస్‌కి ఉన్న మాస్ ఇమేజ్ కోణంలో సలార్‌కే నార్త్ బెల్ట్‌లో ఎక్కువ థియేటర్స్ రావాలని ఈ టీం ప్రయత్నిస్తోంది. షారుఖ్ సీన్‌లోకొచ్చినా చర్చలు ఫలించలేదు. సరే వాళ్ల చర్చలతో ఏం జరుగుతుందనేది తేలాలన్నా ఇంకాం టైం ఉంది కాబట్టి నోప్రాబ్లమ్. కానీ ఈలోపు సలార్ మీద దుష్ప్రచారమే భారీగా పెరిగింది.