Dunki VS Salaar: షారుఖ్ వర్సెస్ ప్రభాస్.. సలార్‌తో పోటీకి రెడీ అయిన డంకీ..
డంకీ రిలీజ్ విషయంలో రెడ్ చిల్లీస్ వెనక్కి తగ్గడం లేదు. వాయిదా వేయాలని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ఒక సౌత్ సినిమాకు జడిసి వెనకడుగు వేసే ఛాన్స్ లేదని షారుఖ్ తేల్చి చెప్పాడట. దీంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ వార్ జరగడం ఖాయం అంటున్నాయి బీటౌన్ వర్గాలు.
Dunki VS Salaar: డంకీ రిలీజ్‌కి షారుక్ రెడీ అవుతున్నాడు. సలార్‌తో పోటీకి సై అంటున్నాడు. ప్రభాస్ స్టామినాని తట్టుకుని సౌత్ మార్కెట్‌లో జెండా పాతాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ప్రమోషన్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. కలిసోచ్చే ప్రతి అంశాన్నీ డంకీ కోసం వాడేస్తున్నాడు. పఠాన్, జవాన్‌తో హిట్స్ కొట్టిన షారుఖ్ ఇప్పుడు డంకీ మూవీని రిలీజ్‌కి రెడీ చేస్తున్నాడు. డిసెంబర్ 22న సలార్ బరిలో దిగుతుడటంతో ఈ మూవీ వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది.
కానీ డంకీ రిలీజ్ విషయంలో రెడ్ చిల్లీస్ వెనక్కి తగ్గడం లేదు. వాయిదా వేయాలని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ఒక సౌత్ సినిమాకు జడిసి వెనకడుగు వేసే ఛాన్స్ లేదని షారుఖ్ తేల్చి చెప్పాడట. దీంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ వార్ జరగడం ఖాయం అంటున్నాయి బీటౌన్ వర్గాలు. సలార్ లాంటి డైనోసర్ ముందున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సరైన ప్రణాళిక ఉండాలి. అందుకే ప్రమోషన్స్ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాడు బాద్ షా. ప్రజెంట్ టీజర్ వర్క్ జరుగుతోంది. నవంబర్ 12న టైగర్ 3 థియేటర్లలో దీన్ని స్క్రీనింగ్ చేయనున్నారు. అలాగే నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఈవెంట్‌లో డంకీ ట్రైలర్ లాంచ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సలార్ ఎంత దూకుడుగా కనిపిస్తున్నా సరే డంకీలో ఉన్న అంశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం షారుఖ్ టీమ్‌లో ఉంది.
థియేటర్ల పంపకాలు ఆల్రెడీ పెద్ద తలనెప్పిగా మారాయి. డంకీ కోసం ఏకంగా పెన్, రిలయన్స్, ధర్మా లాంటి బడా సంస్థలు రంగంలోకి దిగి తమ పలుకుబడితో స్క్రీన్లను బ్లాక్ చేసే పనిలో ఉన్నాయి. ఓవర్సీస్‌లో సలార్ ఇప్పటికే వెయ్యికి పైగా థియేటర్లతో ఒప్పందాలు చేసుకుంది. అక్కడ కూడా థియెటర్స్ కోసం షారుఖ్ టీం లాభియింగ్ చేస్తోంది. మొత్తానికి వచ్చే నెల నుంచి ప్రభాస్, షారుఖ్ టీమ్స్ నువ్వా నేనా అనే రీతిలో పబ్లిసిటీ యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాయి.