Dunki VS Salaar: నార్త్ ఇండియాలో సలార్‌కు డంకీతో చుక్కలేనా..?

డంకీ సినిమానే సలార్‌ని భయపెట్టేలా ఉంది. దానికి కారణం సలార్ ట్రైలర్ పెద్దగా పేలకపోవటమే. అలాని షారుఖ్ డంకీ ట్రైలర్ అదుర్సా అంటే, అదీ లేదు. అయినా డంకీదే పైచేయి అవుతోంది. కారణం జవాన్, పటాన్ హిట్‌ల తర్వాత షారుక్ చేసిన డంకీ.. పెద్దగా అంచనాల భారం మోయట్లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 07:06 PMLast Updated on: Dec 05, 2023 | 7:06 PM

Dunki Vs Salaar Dunki Trailer Poses Threat To Salaar Trailer

Dunki VS Salaar: సలార్ మూవీ టీజర్ వచ్చినప్పుడు డిసెంబర్ 22న బాలీవుడ్‌కి ఉంది ముసల్ల పండగా అన్నారు. ఎప్పుడో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న షారుఖ్ మూవీ డంకీ సైతం ఒకరోజు ముందుకి ప్రీ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అంతగా సలార్ టీజర్ భయపడి షారుకే వెనకడుగు వేయాల్సి వచ్చింది. కట్ చేస్తే ఇప్పడు లెక్కలు మారాయి. డంకీ సినిమానే సలార్‌ని భయపెట్టేలా ఉంది. దానికి కారణం సలార్ ట్రైలర్ పెద్దగా పేలకపోవటమే. అలాని షారుఖ్ డంకీ ట్రైలర్ అదుర్సా అంటే, అదీ లేదు. అయినా డంకీదే పైచేయి అవుతోంది.

GAME CHANGER: గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ అంత సీక్రెట్‌ ఎందుకో..?

కారణం జవాన్, పటాన్ హిట్‌ల తర్వాత షారుక్ చేసిన డంకీ.. పెద్దగా అంచనాల భారం మోయట్లేదు. ఎలాగూ ఎమోషనల్ డ్రామానే కాబట్టి అద్భుతాలు చేయకున్నా, సేఫ్ జోన్‌లో సందడి చేసే ఛాన్స్ ఉంది. కాని సలార్, కంటెంట్ అదిరిపోతే తప్ప అడ్రస్ ఉండదు. కాని ట్రైలర్ చూస్తే ఫ్యాన్స్‌నే భయపెట్టేలా ఉంది. సెకండ్ ట్రైలర్ వచ్చి హైప్ పెంచే హోప్ ఇస్తే చెప్పలేం కాని.. ప్రస్థుతానికి సలార్ అంత అద్భుతాలు చేస్తుందనే అంచనాలు లేవు. డంకీకి కూడా అంత సీన్ లేదు.

కాని నార్త్ ఇండియా మార్కెట్‌లో షారుఖ్‌కి ఉన్న మార్కెట్, వరుస సక్సెస్‌ల వల్ల అక్కడ డంకీ భారీగానే సందడి చేసే ఛాన్స్ ఉంది. సౌత్‌లో డంకీకి సీన్ లేకున్నా, సలార్ ఏమాత్రం అటు ఇటైనా, నార్త్‌లో సలార్‌కి పంచ్ పడేలా డంకీ షాక్ ఇవ్వొచ్చు. ఇదే ఇప్పుడు సలార్ ట్రైలర్ తెచ్చిన తిప్పల్లో ముప్పులాంటి సమస్య ఇది.