Nani : మ‌ళ్లీ ద‌సరా కాంబో రిపీట్..

టాలీవుడ్ (Tollywood) యువ‌ హీరోల్లో నేచుర‌ల్ స్టార్ నానిది (Natural Star Nani) ఓ ప్ర‌త్యేక స్థానం.. విభిన్న త‌ర‌హా చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు నాని.. ఇక నాని కెరీర్‌లో ద‌స‌రా మూవీకి ప్ర‌త్యేక స్థానం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 31, 2024 | 10:37 AMLast Updated on: Mar 31, 2024 | 10:37 AM

Dussehra Combo Repeat Again

 

 

 

టాలీవుడ్ (Tollywood) యువ‌ హీరోల్లో నేచుర‌ల్ స్టార్ నానిది (Natural Star Nani) ఓ ప్ర‌త్యేక స్థానం.. విభిన్న త‌ర‌హా చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు నాని.. ఇక నాని కెరీర్‌లో ద‌స‌రా మూవీకి ప్ర‌త్యేక స్థానం ఉంది. నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ద‌స‌రా మూవీ బ్లాస్ బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘ‌న‌ విజయం సాధించింది. నానీకి మాస్ ఇమేజ్‌ను తీసుకు వ‌చ్చింది.. వందకోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఈ మూవీలో మొద‌టిసారిగా నాని రస్టిక్ మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేశాడు. కాగా.. ఈ కాంబినేషన్‌ మరోమారు రిపీట్‌ కానుంది.

శ్రీకాంత్ ఓదెలతో నాని మరో సినిమా చేస్తారని కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. కాగా.. ద‌స‌రా మూవీ విడుద‌లై మార్చి 30తో ఏడాది పూరైన నాని సర్‌ప్రైజింగ్ ప్రకటన చేశాడు. శ్రీకాంత్ ఓదెలతో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎరుపురంగులో పెయింట్‌ చేయబడ్డ పోస్టర్‌ వయొలెన్స్‌ను సూచిస్తోంది. గడ్డం పెంచి మెలి తిప్పిన మీసాలతో నాని మాస్‌ అవతారంలో కనిపిస్తున్నాడు. ‘యూ డోంట్‌ నీడ్‌ ఆన్‌ ఐడెంటిటీ టు బీ ఏ లీడర్‌’ అని పోస్టర్‌పై రాసిన క్యాప్షన్‌ సినిమా కాన్సెప్ట్‌ను తెలిపేలా ఉంది.

దసరా మూవీని నిర్మించిన ఎస్ఎల్వి సినిమాస్ సంస్థ పై సుధాకర్ చేరుకూరి దీనిని కూడా గ్రాండ్ గా నిర్మించనున్నారు. నానికి 33వ చిత్రం కావడంతో దీని వర్కింగ్ టైటిల్ నాని33గా ఉంది. ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనున్న‌ట్లు తెలుస్తోంది. నాయకుడిగా ఉండేందుకు గుర్తింపు అవసరం లేదంటూ Nani33 పోస్టర్‌పై ఉంది. ఈ చిత్రంలో నాని పవర్‌ఫుల్‌ మాస్‌ పాత్రలో కనిపించ‌నున్న‌ట్లు పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.