Dussehra Movies: దసరా సినిమాలకు థియేటర్ల కరువు.. ఘోస్ట్ పరిస్థితి ఏంటి..?
టాలీవుడ్‌లో ఈ దసరాకి 4 పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోలకు థియేటర్లు సర్దుబాటు చేయడమే పెద్ద తలనెప్పిగా మారింది. ఈ తరుణంలో అదనంగా వచ్చి చేరిన గణపథ్‌కి మల్టీప్లెక్సుల పరంగా ముప్పు తప్పేలా లేదు.
Dussehra Movies: దసరా పోటీ పాన్ ఇండియా సినిమాల మధ్య భారీ ఫైట్‌ని షురూ చేసింది. ఒకేసారి 5 పెద్ద సినిమాలు బరిలో దిగడంతో థియేటర్స్ లభించడం పెద్ద సమస్యగా మారింది. ఇదే కన్నడ మూవీ ఘోస్ట్‌కి భారీ షాక్ ఇచ్చేలా ఉంది. డబ్బింగ్ వర్షన్ వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఈ దసరాకి 4 పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోలకు థియేటర్లు సర్దుబాటు చేయడమే పెద్ద తలనెప్పిగా మారింది. ఈ తరుణంలో అదనంగా వచ్చి చేరిన గణపథ్‌కి మల్టీప్లెక్సుల పరంగా ముప్పు తప్పేలా లేదు.
అయితే వీటికి ఏ మాత్రం తీసిపోని బడ్జెట్‌తో గ్రాండ్‌గా తెరకెక్కింది ఘోస్ట్. ఈ ప్రాజెక్ట్‌ని అక్టోబర్ 20న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. జైలర్‌లో నరసింహగా అదరగొట్టిన శివరాజ్ కుమార్ హీరో కావడంతో ఇతర బాషల డిస్ట్రిబ్యూటర్ల నుంచి బాగానే ఆఫర్స్ వచ్చాయి. సినిమా రిలీజ్‌కి కర్ణాటకలో ఎలాంటి సమస్య లేదు. ముందురోజు అర్ధరాత్రి నుంచే షోలు వేసే రేంజ్‌లో భారీ హైప్ నెలకొంది. కానీ తెలుగు, తమిళంలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో అక్టోబర్ 27కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికైతే ఘోస్ట్ కన్నడ వెర్షన్ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు. థియేటర్లు కేటాయించారు. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. కానీ, రిస్క్ ఏంటంటే డబ్బింగ్ రిలీజయ్యే నాటికి టాక్ బయటికి వచ్చేస్తుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు. ఏ మాత్రం యావరేజ్ టాక్ వచ్చినా ఇతల లాగ్వేజెస్‌లో ఈ మూవీని చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చూపించరు. అందుకే ఘోస్ట్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది.
ఘోస్ట్ కోసం శివరాజ్ కుమార్ చాలా కష్టపడ్డాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం భారీ రిస్క్ చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వయసుని భారీగా తగ్గించుకున్నాడు. తీరా చూస్తే పోటీ వల్ల ఒకేసారి అందరికీ ఈ సినిమా చూపించలేకపోతున్నాడు. ఘోస్ట్ తెలుగు హక్కులు ఎవరు కొన్నది ఇంకా తెలియలేదు. బాలయ్య, రవితేజ, విజయ్‌లతో పోల్చుకుంటే శివన్నకు మన దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. ఘోస్ట్ నుంచి అది వస్తుందని ఆశపడితే.. దసరా కాంపిటీషన్ తన ప్లాన్ ని రీవర్స్ చేసింది.