Tiger Nageswara Rao: దసరా సినిమాలకు అదొక్కటే సమస్య.. ప్రేక్షకులు చూస్తారా..?
ప్రస్తుతం సినిమా రిజల్ట్ ఎలా వున్నా.. ముందుగా లెంగ్త్ హాట్ టాపిక్‌గా మారుతోంది. నిడివి 2 గంటల 15 నిమిషాలంటే.. మరీ చిన్న సినిమా అంటారు. మూడు గంటలు వుంటే.. అమ్మో ఇంత పెద్ద సినిమానా అంటూ కామెంట్స్ చేస్తారు.

Tiger Nageswara Rao: దసరాకు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. బాలకృష్ణ భగవంత్ కేసరిగా.. రవితేజ టైగర్ నాగేశ్వరరావుగా.. విజయ్ లియోగా వస్తున్నాడు. దసరా సినిమాన్నీ సెన్సార్ పూర్తిచేసుకుని U/A సర్టిఫికేట్ అందుకున్నాయి. అయితే.. వీటి రన్ టైం మీద పెద్ద చర్చే నడుస్తోంది. ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. కారణం.. ఆ సినిమా ఎక్కువ నిడివితో వస్తుండటమే. ప్రస్తుతం సినిమా రిజల్ట్ ఎలా వున్నా.. ముందుగా లెంగ్త్ హాట్ టాపిక్‌గా మారుతోంది.
నిడివి 2 గంటల 15 నిమిషాలంటే.. మరీ చిన్న సినిమా అంటారు. మూడు గంటలు వుంటే.. అమ్మో ఇంత పెద్ద సినిమానా అంటూ కామెంట్స్ చేస్తారు. 20న రిలీజ్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు నిడివి మూడు గంటలు దాటిపోయింది. సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ అందుకున్న టైగర్ నాగేశ్వరరావు లెంగ్త్ 3 గంటల ఒక్క నిమిషం వచ్చింది. స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నాగేశ్వరరావు బయోపిక్‌ను రెండు పార్టుల్లో తీయాల్సి వున్నా.. ఒక పార్ట్‌లోకి తీసుకురావడంతో.. కథ పెద్దదై 3 గంటలు వచ్చిందట. టైగర్ నాగేశ్వరరావులా లియో కథ మరీ పెద్దది కాకపోయినా రెండు గంటల 44 నిమిషాలు వచ్చింది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలు దాదాపు మూడు గంటలు నడిచాయి.
ఖైదీ, విక్రమ్‌కు సీక్వెల్ వుండేలా ఎండింగ్ ఇచ్చాడు. లియోకు కూడా సీక్వెల్ ప్లాన్ చేశాడో లేదో చూడాలి. ఇక భగవంత్ కేసరి అయితే.. మరీ ఎక్కువా కాదు.. తక్కువా కాదన్నట్టు.. రెండు గంటల 35 నిమిషాలతో సినిమాను ముగించేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కన్నడలో 19నే రిలీజ్ అవుతున్న ఘోస్ట్.. థియేటర్స్ లేక తెలుగులో 25న రిలీజ్ అవుతోంది. 2 గంటల 7 నిమిషాల నిడివితో దసరా సినిమాలన్నింటిలో తక్కువ నిడివితో ఘోస్ట్ రిలీజ్ అవుతోంది.