EAGLE COLLECTIONS: ఫస్ట్ డే కలెక్షన్స్.. రవితేజ స్టామినా ఇదే
రవి తేజ నటనకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మంచి పాయింట్‌తో తెరకెక్కిందనే కితాబుని కూడా అందుకుంటున్న ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

EAGLE COLLECTIONS: మాస్ మహారాజ రవితేజ నుంచి వచ్చిన లేటెస్ట్ మిస్సైల్ ఈగల్. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకుపోతుంది. రవి తేజ నటనకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మంచి పాయింట్‌తో తెరకెక్కిందనే కితాబుని కూడా అందుకుంటున్న ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
Pushpa 2: పుష్ప ఫీవర్.. ‘పుష్ప 2’ మామూలుగా ఉండదట
ఈగల్ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 11.90 కోట్ల గ్రాస్‌ని సాధించింది. దీంతో రవితేజ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఈగల్ నిలిచింది. ఇప్పడు ఈ కలెక్షన్స్‌తో మాస్ మహారాజ్‌కి తెలుగు నాట ఉన్న క్రేజ్ మరో సారి అర్ధం అయ్యింది. వీకెండ్‌లో ఈగల్ మరిన్ని రికార్డు కలెక్షన్‌లు రాబడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. రవి తేజ ఫ్యాన్స్ మాత్రం సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకున్న ఈగల్‌లో రవితేజ సరసన కావ్య థాపర్ నటించగా, మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించింది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వ ప్రతిభ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అలాగే మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉందనే కితాబుని కూడా అందుకుంది. డేవ్ జాండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్లింది.