Eagle : పనైపోయిందన్నారు.. కానీ 50 కోట్లు
చివరగా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాతో సోసోగానే మెప్పించిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం థియేటర్లో ఈగల్‌గా అలరిస్తున్నాడు. అయితే.. డే వన్ మిక్స్డ్ టాక్‌తో మొదలైన ఈగల్ సినిమా.. మౌత్ టాక్ బాగుండడంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈగల్ సినిమా మూడు రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Eagle He said it fell... but 50 crores
చివరగా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాతో సోసోగానే మెప్పించిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం థియేటర్లో ఈగల్‌గా అలరిస్తున్నాడు. అయితే.. డే వన్ మిక్స్డ్ టాక్‌తో మొదలైన ఈగల్ సినిమా.. మౌత్ టాక్ బాగుండడంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈగల్ సినిమా మూడు రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సంక్రాంతికి మిగతా సినిమాలకు థియేటర్లు ఇచ్చి.. రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ అయిన ఈగల్ సినిమాకు.. ఫస్ట్ వీకెండ్‌లో మంచి వసూళ్లే వచ్చాయి. కానీ ఆ తర్వాత సెకండ్ వీక్ మండే నుంచి ఈగల్ కలెక్షన్స్ డల్ అయ్యాయి.
అసలు ఈగల్ (Eagle) ఎంత రాబడుతుందో.. మేకర్స్ నుంచి కూడా అఫిషీయల్ నెంబర్స్ బయటికి రాలేదు. దీంతో.. ఇక ఈగల్ రెక్కలు విరిగిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు కొందరు. కానీ సెకండ్ వీకెండ్‌లో పుంజుకున్న ఈగల్.. తాజాగా 50 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేనాటికి మొత్తంగా పది రోజుల్లో.. వరల్డ్ వైడ్‌గా 51.4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
సుమారు 22 కోట్ల బ్రేక్ ఈవన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈగల్ సినిమా.. దాదాపుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అయినట్టేనని అంటున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. మరి ఫైనల్ రన్‌లో ఈగల్ ఎంత వరకు రాబడుతుందో చూడాలి.