EAGLE REVIEW: ఈగల్ రివ్యూ.. యాక్షన్ ఫీస్ట్.. రవితేజ ఊచకోత నెక్ట్స్ లెవల్

కార్తిక్ ఘ‌ట్టమ‌నేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2024 | 12:43 PMLast Updated on: Feb 09, 2024 | 7:47 PM

Eagle Review Ravitejas Eagle Movie Got Possitive Response From Audience

EAGLE REVIEW: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తిక్ ఘ‌ట్టమ‌నేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ ఎలా ఉందో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే.
కథ..
స్టోరీ విషయానికి వస్తే.. ఒక గిరిజన తండా.. సహదేవ వర్మ విగ్రహాన్ని పెట్టుకొని అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు. అయితే ఈ ఊరికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ఆ ఊరిలో పండించిన పత్తితో చేనేత కారులు బట్టలు తయారు చేస్తారు. అయితే అక్కడ తయారైన బట్టలకు ఓ రేంజ్ లో పబ్లిసిటి ఉంటుంది. అయితే దానిని తీసుకువచ్చే వ్యక్తి కనిపించకుండా పోతాడు. దీంతో మిస్సింగ్ అయిన మ్యాటర్ ను గురించి అనుపమ ఆర్టికల్ రాయడంతో సీబీఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని ఒకరోజు ముద్రించకుండా అడ్డుకుంటుంది. దీంతో అసలు ఆ మిస్సయిన సహదేవ్ వర్మ ఎవరు ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సీబీఐ రంగంలోకి దిగిందన్న విషయాలు తెలుసుకునేందుకు జర్నలిస్టుగా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఊరి గురించి దేవుడిగా భావించే సహదేవ్ గురించి ఏం తెలుసుకుందన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Zheng Xiang Income : అదేం సంపాదన భయ్యా ! ఆమె ఆదాయం వారానికి 120 కోట్లు !
పర్పామెన్స్ ఎలా ఉంది..?
సహదేవ్ గా రవితేజ నట విశ్వరూపం చూపించాడు. వన్ మ్యాన్ షోలా నడించాడు. ఊరమాస్ ఊచకోతకు థియేటర్ లో పూనకాలు మొదలయ్యాయి. రవితేజ కు డైలాగ్స్ ఎక్కువగా లేకపోయిన… కళ్ల తో భావాలను పలికించిన తీరు అద్భుతమనే చెప్పాలి. నవదీప్, అనుపమ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయని అంటున్నారు. అనుపమ జర్నలిస్ట్ రోల్‌లో ఒదిగిపోయింది. నవదీప్‌కి చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ రోల్ దొరికింది. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్ వంటి వాళ్ళ పాత్రలు కూడా పరిమితమైనా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీ వంటి వాళ్ల మధ్య కామెడీ ట్రాక్ ఆకట్టుకునే విధంగా ఉంది.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయానికి వస్తే.. ‘సూర్య vs సూర్య’ తర్వాత 9 ఏళ్ల గ్యాప్ తీసుకుని, ‘ఈగల్’ మూవీ చేశాడు కార్తీక్ ఘట్టమనేని. యాక్షన్ సీన్స్‌పైన, డైలాగ్స్‌పైనే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఫస్టాఫ్‌ సాగతీతగా అనిపించినా.. సెకండాఫ్‌ చాలా థ్రిల్లింగ్‌గా సాగి, ఎమోషనల్‌ క్లైమాక్స్‌తో ముగించినతీరు ఆకట్టుకుంది. దేవ్ జాండ్ పాటలకన్నా సౌండ్ డిజైనింగ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.నిర్మాణ విలువలు బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా డిజైన్ చేసిన విధానం చాలా స్టైలిష్ గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మెచ్చుకోకుండా ఉండలేము. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఈగల్ మూవీ ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారి ఈగల్ నచ్చుతుంది.
https://youtu.be/S7jPEfRNA9M