ప్రభాస్ సినిమాపై ఉగ్రదాడుల ఎఫెక్ట్.. ఫౌజీ నుంచి ఆమెను తప్పించాలంటూ డిమాండ్..!
నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ చెప్పిన బటర్ ఫ్లై ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ సినిమాకు వర్కౌట్ అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.

నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ చెప్పిన బటర్ ఫ్లై ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ సినిమాకు వర్కౌట్ అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే నాలుగు కీలక షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేసి.. 2026 సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక్కడి వరకు సినిమా షూటింగ్ అంతా సాఫీగా జరిగింది.. కానీ అసలు సమస్యలు ఇప్పుడే మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ముక్తకంఠంతో అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ ను వెంటనే తొలగించాలి అనే డిమాండ్ ఎక్కువైపోయింది. దానికి కారణం ఆమె పాకిస్తాన్ అమ్మాయి కావడమే. ఇమాన్వి కరాచీలో పుట్టింది. ఆమె తండ్రి మాజీ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ కూడా. అసలే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మీద ఇండియాలో పీకల్లోతు కోపం ఉంది. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ సినిమాలో హీరోయిన్ పాకిస్తాన్ మాజీ ఆర్మీ అధికారి కూతురు అని తెలిసిన తర్వాత.. అది సినిమాపై కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయి కావడంతో ప్రభాస్ సినిమా నుంచి వెంటనే ఆమెను తప్పించాలని డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ నటులకు ఇండియన్ సినిమాలలో ఎలాంటి అవకాశాలు ఇవ్వడానికి లేదనే ప్రచారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కరాచీలో పుట్టిన ఇమాన్వి.. కాలిఫోర్నియాలో పెరిగింది. అక్కడే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంది.
సోషల్ మీడియాలో ఆమెను చూసి ప్రభాస్ సినిమాకు ఎంచుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. నిజానికి ఈ అమ్మాయిని సినిమాలో తీసుకున్నప్పుడు.. ఇంతకు ఎవరు ఈ ఇమాన్వి ఇస్మాయిల్ అంటూ ఆరా బాగానే తీశారు అభిమానులు. అప్పుడు ఆమె బ్యాగ్రౌండ్ అమెరికా అని మాత్రమే తెలిసింది. ఇప్పుడు జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఆమె పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటికి వచ్చాయి. ప్రస్తుతం వస్తున్న డిమాండ్స్ చూసిన తర్వాత ఫౌజీ మేకర్స్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇప్పుడు మళ్లీ మొత్తం రీ షూట్ చేయాలంటే చిన్న విషయం కాదు. ఇలాంటి సమయంలో దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.