Elephant Whisperers: ఎలిఫెంట్‌ విస్పర్స్‌ ప్రత్యేకత ఏంటి.. ఆస్కార్ ఎలా వచ్చింది?

ఎలిఫెంట్ విస్పర్స్ అంటే.. ఏనుగు చెప్పిన మాట.. చెప్పాలనుకున్న మాట ! మనుషులకు, ఏనుగులకు మధ్య రిలేషన్‌ గురించి కళ్లు చెమర్చేలా చూపించిన సినిమా ఇది !

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2023 | 12:12 PMLast Updated on: Mar 13, 2023 | 12:12 PM

Elephant Whisperers Got Oscar In Best Short Film Category

మన సినిమా.. మన మట్టి సినిమా అని ట్రిపుల్‌ ఆర్‌ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కానీ.. అదే స్థాయి సినిమా ఎలిఫెంట్ విస్పర్స్. ఆస్కార్ సాధించిన ఇండియన్ ప్రొడక్షన్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆస్కార్ గెలిచిన వేళ.. ఈ 35నిమిషాల షార్ట్ గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అంతా ! ఎలిఫెంట్ విస్పర్స్ అంటే.. ఏనుగు చెప్పిన మాట.. చెప్పాలనుకున్న మాట ! మనుషులకు, ఏనుగులకు మధ్య రిలేషన్‌ గురించి కళ్లు చెమర్చేలా చూపించిన సినిమా ఇది ! కొత్త డైరెక్టర్ అయినా.. కార్తికి గొనసల్వేస్‌.. మనసు హత్తుకునేలా చిత్రాన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఉందీ మూవీ !

అడవి నుంచి తప్పించుకున్న రఘు, అము అనే రెండు ఏనుగులను.. బొమ్మన్ అండ్ బెల్లి అనే ఇద్దరు సాకుతూ ఉంటారు. ఆ ఏనుగులతో వారికి ఎలాంటి బాండింగ్ క్రియేట్ అయిందనేది మెయిన్ కాన్సెప్ట్ అయినా.. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అంతకుమించి అనిపిస్తుంది స్టోరీలో ! ఏనుగులకు, మనుషులకు మధ్య అనుబంధం కాదు.. ఆ నలుగురి, అడవితో అనుబంధాన్ని పక్కాగా చూపించారు డైరెక్టర్. మనుషులు, మూగజీవాల మధ్య బాండింగ్ మాత్రమే కాదు.. సనాతన భారతీయ సంప్రదాయాలను.. అడవి బిడ్డల బతుకులను, అడవి సంరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను మనసు హత్తుకునేలా చూపించారు కార్తికి. ఇది ఆస్కార్ కమిటీ మనసు గెలుచుకుంది.

స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి గతంలో అవార్డు దక్కినా.. అది ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ కాదు.. భారత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాకు ఆస్కార్ దక్కడం.. ఎలిఫెంట్‌ విస్పర్స్‌తోనే మొదటిసారి. అందుకే ప్రత్యేకం అనిపిస్తోందీ మూవీ.