Devara koratala : దేవర లో మిర్చిని మించిన ఎలివేషన్స్

ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) గ్లోబల్ హీరో (Global Hero) గా మారిపోయారు. ఆయన పోషించిన పాత్ర, అందులోని నటనకు అందరూ ఫిదా అయ్యారు.. ఆ సినిమా తర్వాత జూనియర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. ఇక విడుదలకు ముందే భారీ హైప్‌ని సొంతం చేసుకున్న ఈ ఎనర్జిటిక్ మూవీ ..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 10:09 AMLast Updated on: Feb 12, 2024 | 10:09 AM

Elevations Beyond Mirchi In Devara

ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) గ్లోబల్ హీరో (Global Hero) గా మారిపోయారు. ఆయన పోషించిన పాత్ర, అందులోని నటనకు అందరూ ఫిదా అయ్యారు.. ఆ సినిమా తర్వాత జూనియర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. ఇక విడుదలకు ముందే భారీ హైప్‌ని సొంతం చేసుకున్న ఈ ఎనర్జిటిక్ మూవీ .. సోషల్ మీడియాను ఇప్పటికే షేక్ చేస్తోంది.. ఈ మూవీ పోస్టర్ దగ్గర నుంచి జూనియర్ లుక్, గ్లింప్స్ ఇలా.. ఏ అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్‌లో పూనకాలు వచ్చేస్తున్నాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నుంచి ఇప్పటి వరకు ఏ చిత్రం రాకపోవడంతో.. దేవర మూవీ కోసం జూనియర ఫ్యాన్స్‌తో పాటు కామన్‌ ఆడియన్స్‌ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాలో జూనియర్ నటవిశ్వరూపం చూపించబోతున్నాడని.. బాక్సాపీస్‌పై పంజా విసరబోతున్నాడంటూ ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు.. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌కు మరింత ఖుషీ చేస్తున్నాయి..

ఇక.. ఆచార్య మూవీ రిజల్ట్‌తో బాగా డిజప్పాయింట్ అయిన కొరటాల శివ (koratala Shiva).. దేవరతో భారీ హిట్‌ కొట్టి తన సత్తా ఏంటో తెలియజేయాలని గట్టిగా ఫిక్సయిపోయాడట.. దీంతో.. తాను తీసిన సూపర్ హిట్ మూవీ మిర్చిలోని ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలని డిసైడయ్యాడట.. మిర్చి సినిమాలో తండ్రీకొడుకుల మధ్య వచ్చిన ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన కొడుకు.. ఆ తండ్రి కోసం చేసే పోరాటం.. ఆ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన సీన్స్‌ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయి.. ఇప్పుడు దేవర సినిమాలోనూ ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలనుకుంటున్నాడట కొరటాల శివ.. అందుకే దేవర సినిమాలోనూ అంతకు మించిన సెంటిమెంట్‌- ఎలివేషన్ సీన్స్ ఉంటాయని మూవీ టీం చెబుతోంది.. ఇవి.. దేవర సినిమా నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్తాయంటోంది.. దీంతో.. ఈ సీన్స్‌లో జూనియర్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్‌ తెగ సంబర పడిపోతున్నారు..

కాగా.. ఈ మూవీలో మరొక హీరోయిన్‌ కూడా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. చిత్ర యూనిట్ మరో హీరోయిన్ ను ఎంపిక చేసిందట. గుజరాతి నటి, ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్టనేకర్ భార్య శృతి మరాఠే మరో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.. ఎన్టీఆర్ పక్కనే ఉండే ఓ ప్రముఖ పాత్రలో ఆమె నటించబోతున్నట్లు సమాచారం. జాన్వీకపూర్ కన్నా ఈ ముద్దుగుమ్మ చాలా బాగుందంటూ తెలుగు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.వాస్తవానికి మరో హీరోయిన్ గా కృతి శెట్టి, మృణాల్ ఠాకూర్ తదితర నటీమణుల పేర్లు షికార్లు చేసినప్పటికీ చివరకు శృతి పేరు ఫైనల్ అవడంతోపాటు ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో.. ఈ లేటెస్ట్ అప్‌డేట్స్‌తో దేవర్ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హైని తాకుతున్నాయంటున్నారు సినీ పండితులు..