Emraan Hashmi: ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. ఓజీ’ నుంచి మెంటలెక్కించే పోస్టర్

ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సంద‌ర్భంగాబ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ ఇమ్రాన్ పోస్ట‌ర్ మేకర్స్ విడుద‌ల చేశారు. పోస్టర్ లో ఇమ్రాన్‌ హష్మీ లుక్ అదిరిపోయింది. సిగర్ తాగుతూ.. రగడ్ లుక్‌లో ఇమ్రాన్ కనిపిస్తున్నాడు.గడ్డం, నుదుటున గాటు, చేతికి కడియం, టాటూతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2024 | 02:19 PMLast Updated on: Mar 24, 2024 | 2:19 PM

Emraan Hashmis First Look In Pawan Kalyans Og Released

Emraan Hashmi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఓజీ హ్యాష్ ట్యాగ్ నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది. యంగ్ డైరెక్టర్ సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ పోస్ట్ పోన్ అయింది.

venkatesh 76 : ‘వెంకటేష్ 76 ‘ ప్రాజెక్టు వెనుక ఇంత కథ ఉందా?

తాజాగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సంద‌ర్భంగాబ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ ఇమ్రాన్ పోస్ట‌ర్ మేకర్స్ విడుద‌ల చేశారు. పోస్టర్ లో ఇమ్రాన్‌ హష్మీ లుక్ అదిరిపోయింది. సిగర్ తాగుతూ.. రగడ్ లుక్‌లో ఇమ్రాన్ కనిపిస్తున్నాడు.గడ్డం, నుదుటున గాటు, చేతికి కడియం, టాటూతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటేనే.. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్‌ హష్మీ తలపడే సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయనే ఆసక్తి కలుగుతోంది. ఓజీ సినిమా జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

ఇప్ప‌టికే దీని నుంచి ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ విడుద‌ల అవగా అవి పవన్ అభిమానులకు విపరీతంగా అలరించాయి. ఈ సినిమాలో ఇమ్రాన్ ఒమీ భావు అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.