Double Ismart : యంగ్ డైరెక్టర్ తో ఎనర్జిటిక్ హీరో… ఇక రచ్చే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Star Ram) కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత చిత్రాలు ‘ది వారియర్, స్కంద’ ఆశించిన విజయాలు సాధించలేదు.

Energetic star Ram is facing successive bitter experiences.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Star Ram) కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత చిత్రాలు ‘ది వారియర్, స్కంద’ ఆశించిన విజయాలు సాధించలేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) తో భారీ విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు ఉస్తాద్ రామ్. ‘డబుల్ ఇస్మార్ట్’ ఫినిషింగ్ స్టేజ్ కు రావడంతో కొత్త సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో రామ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారని వినిపించింది. అయితే.. త్రివిక్రమ్-రామ్ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. మరో యంగ్ డైరెక్టర్ తో ఎనర్జిటిక్ స్టార్ సినిమా చేయబోతున్నాడనేది లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.
అనుష్క తో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చేసి హిట్ కొట్టిన మహేష్ తో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడట రామ్. ఈ సినిమా సైలెంట్ గా ముహూర్తాన్ని కూడా పూర్తిచేసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందే ఈ చిత్రాన్ని వచ్చే వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.