10000 మంది తో ఎంట్రీ… డ్రాగన్ వస్తే నిప్పులతోనే..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగు పెట్టబోతున్నాడు. ఈనెల 22 నుంచి షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడని మొన్నే ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేసింది. కాకపోతే తన ఎంట్రీ సినిమాలోనే కాదు సెట్లో కూడా భూమ్ బద్దలయ్యేలా ప్లాన్ చేసినట్టున్నారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగు పెట్టబోతున్నాడు. ఈనెల 22 నుంచి షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడని మొన్నే ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేసింది. కాకపోతే తన ఎంట్రీ సినిమాలోనే కాదు సెట్లో కూడా భూమ్ బద్దలయ్యేలా ప్లాన్ చేసినట్టున్నారు. ఏకంగా 10000 వేల మందితో పూనాకాలొచ్చే సీన్ తో ఎంట్రీ ప్లాన్ చేశారట. ఈపాటికే హీరో లేని సీన్ షూటింగ్ జరిగింది. దర్నాలు, తొక్కిసలాట లాంటి సీన్లను 4 వేల మందితో తెరకెక్కించాల్సి వచ్చింది. అదే ఆమధ్య సెన్సేషన్ అయితే, ఇక సీన్లోకి హీరో వస్తే ఏంటి పరిస్థితి… త్రిబుల్ ఆర్ లో 2 వేల మందితో ఫైట్ సీన్ పెట్టి చరణ్ ఎంట్రీని రాజమౌలి డిజైన్ చేస్తే, డ్రాగన్ లో 10000 మందితో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. త్రిబుల్ ఆర్ లో పులితో ఫైట్ సీన్ ని రాజమౌళి డిజైన్ చేస్తే, ఇక్కడ యుద్ధ ట్యాంక్ తో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ని నెక్ట్స్ లెవల్ లో ప్లాన్ చేశాడట. ప్రజెంట్ ఆ యుద్ధ ట్యాంక్ నే కార్బన్ ఫైబర్ తో సినిమాకోసం రెడీ చేస్తున్నట్టుతెలుస్తోంది. ఇంతకి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ఇంకేం చేయబోతున్నాడు..? షూటింగ్ కంటేముందే ఈ విషయాలన్నీ బయటికెలా వస్తున్నాయి..?
త్రిబుల్ ఆర్, దేవర తో రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ తో, కేజీయఫ్2 భాగాలు, సలార్ లాంటి 3 పాన్ ఇండియా హిట్లు సొంత చేసుకున్న ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే పూనకాలు గ్యారెంటీ. అలాంటి సినిమా ఎప్పుడో లాంచైంది. హీరో లేని సీన్లు తీస్తూ డ్రాగన్ టీం బిజీ అయ్యింది. ఇప్పుడు ఇంతకాలానికి ఈనెల 22న డ్రాగన్ సెట్లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టడం కన్ఫామ్ అయ్యింది
అది కూడా మామూలు సీన్ తో కాదు, గ్రాండ్ గానే తన ఎంట్రీ సీన్ ని ఇప్పుడు తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. మామూలుగానే తన సినిమాలో హీరోయిజం ఓరేంజ్ లోఎలివేట్ అవుతుంది. కేజీయఫ్ లోరాఖీ భాయ్ ఎలివేషన్లు మతిపోగొడితే, సలార్ లో హీరో ఎలివేషన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అలాంటి డైరక్టర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ సీన్ ఇంకెలా ప్లాన్ చేస్తాడు..?
కేజీయఫ్ లో పెద్దమ్మ అని చాలా పెద్ద గన్ నే రాకీ భాయ్ వాడాడు.. డ్రాగన్ లో మాత్రం అంతకంటే పెద్దదే వాడుతున్నారు. అదేయుద్ధ ట్యాంకు.. ఇంతవరకు సినిమాల్లో యుద్ధ ట్యాంక్ ని వాడారు కాని, దానితో హీరో ఫైట్ చేయటం లాంటి సీన్ ని ఎవరూ చూడలేదు.
హాలీవుడ్ సూపర్ హీరోల మూవీల్లోనే ఒకటి రెండు సీన్లు అలాంటి వి కనిపించాయి. అయితే అలా సూపర్ హీరోల స్టైల్లో కాదు కాని, మరోలా యుద్ధ ట్యాంక్ తో డ్రాగన్ ఫైట్ ఉండబోతోందట. అందుకోసమే కార్బన్ ఫైబర్ తో యుద్దం ట్యాంక్ ని పోలివుండే వేహికిల్ ని రెడీ చేస్తున్నారు. ఆ డిజైన్ వల్లే ఇలా ఈ మ్యాటర్ లీకైంది.
ఈనెల 22న డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెడ్డుతున్నాడు వరకు ఓకే, కాని, మొదటి రోజు తనతో ఏ సీన్ తీస్తారనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే 10 వేల మంది తో, అలానే యుద్ధట్యాంక్ తో హీరో ఫైట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చే ఓవర్ ద టాప్ సీన్ ఉండబోతోందట. 2 వేల మందితో త్రిబుల్ ఆర్ లో చరణ్ ఎంట్రీ సీన్ కే సీట్లు చింపారు…. జంతువులతో ఇంటర్వెల్ బ్యాంగ్ కి పూనకాలతో ఊగిపోయారు..
సో పదివేల మంది ఒక వైపు,యుద్ధ ట్యాంక్ తో హీరో ఫైట్ చేయటం మరోవైపు.. అలాంటి సీన్ తో హీరో ఎంట్రీ అంటే ఇక పూనకాలు లోడ్ అవ్వాల్సిందే… మొత్తానికి వచ్చే మంగళవారం కాక , వచ్చే మంగళ వారంలోపు యుద్ధ ట్యాంక్ సిద్ధమౌతుందని తెలుస్తోంది.