200 కోట్లు వచ్చినా.. సంతోషం లేదు, బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఒక్కొక్కటి ఓటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 10:31 AMLast Updated on: Feb 13, 2025 | 10:31 AM

Even If It Gets 200 Crores Not Happy Bad News For Balayya Fans

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఒక్కొక్కటి ఓటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లలో కంటే ఓటీటీలోనే జనాలు ఎక్కువగా ఆ సినిమాను ఇష్టపడుతున్నారు. ఇక సంక్రాంతి వస్తున్నాం సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. మరి నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాపై మాత్రం అప్డేట్ లేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది.

జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను నార్మల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. దీనితో సంక్రాంతికి రెండు సినిమాలు హిట్ అయితే అందులో ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థియేటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే కచ్చితంగా కలెక్షన్లు బాగా వచ్చేవని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. కావాలనే దిల్ రాజు థియేటర్లను లాక్కున్నాడు అని కూడా కొంతమంది తిట్టడం మొదలుపెట్టారు.

అయితే ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. ఈ సినిమాను ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుక్కుంది. అయినా సరే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై అనౌన్స్మెంట్ రావటం లేదు. దీనితో నందమూరి అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్యకు రేంజ్ పెరిగిపోయింది. ఆయన ఏ సినిమా చేసిన సరే జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. దీనితో ఈ సినిమాకు కూడా అలాగే క్రేజ్ క్రియేట్ అయింది. అయినా సరే ఇప్పటివరకు ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కాకపోవడం పై ఫాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.

అటు మూవీ మేకర్స్ కూడా దీనిపై ఎటువంటి అనౌన్స్మెంట్ చేయడం లేదు. చూస్తుంటే మరో నెల రోజులు పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న బాలయ్య తర్వాత సినిమాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. అఖండ సీక్వెల్ కంప్లీట్ చేసి ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమాకు వర్క్ చేయాలని బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ సీక్వెల్ ను సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్న మేకర్స్… దీనిపై త్వరలోనే ఒక క్రేజీ అప్డేట్ కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రెడీ అయిపోయింది. అయితే శివరాత్రి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత గ్రాండ్ గా ఉండేలా వర్కౌట్ చేశాడు.