Urvashi Rautela : ఊర్వశి రౌతేలా ను మనవాళ్ళు కట్ చేస్తున్నారా..?
సినిమా ఈవెంట్స్‌లో ఊర్వశి రౌతేల చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు రెమ్యునరేషన్ కంటే.. పబ్లిసిటీ ఎక్కువ కోరుకుంటుంది. వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్‌లో.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిని అంటిపెట్టుకునే వుంది.

Even if it is an item song done by Urvashi Rautela she gives a build up as if she is the heroine Promotion is done at heroic levels
ఊర్వశి రౌతేలా చేసింది ఐటెం సాంగ్ అయినా.. తనే హీరోయిన్ అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. వీర లెవల్లో ప్రమోషన్ చేసుకుటుంది. ఈవెంట్స్‌లో ఈ అమ్మడి సందడి చూస్తే.. ఈ అమ్మడే హీరోయిన్ అనుకుంటారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేసే ఊర్వశి రౌతేలను రామ్ పక్కన పెట్టేశాడు. ఐటంగర్ల్‌కు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు?
సినిమా ఈవెంట్స్‌లో ఊర్వశి రౌతేల చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు రెమ్యునరేషన్ కంటే.. పబ్లిసిటీ ఎక్కువ కోరుకుంటుంది. వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్‌లో.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిని అంటిపెట్టుకునే వుంది. స్టేజ్ మీద స్పేస్ లేకపోయినా.. తీసుకుని మరీ.. చిరంజీవి పక్కకు చేరింది. బ్రో వేడుకలో హీరోయిన్స్ కేతిక శర్మ… ప్రియా వారియర్ మూల నుంచుంటే.. ఈ అమ్మడు మాత్రం తనే మెయిన్ హీరోయిన్ అన్నట్టు.. సందడి చేసింది.
రామ్ స్కందలో ఐటంసాంగ్ చేసినా.. జరిగిన రెండు ఈవెంట్స్‌లో ఊర్వశి కనిపించకపోవడం విశేషం. కల్ట్ మామా సాంగ్ రిలీజైన వెంటనే.. వీడియో ప్రమోషన్లో మాట్లాడింది. ఫోకస్ అంతా ఈ అమ్మడిపై వెళ్తుందని మేకర్స్ పిలవలేదా? లేదా? డేట్స్ అడ్జస్ట్ చేసుకో లేక రాలేక పోయింది గానీ.. కల్ట్ మామతో సందడి చేయలేకపోయింది ఈ ఐటం గర్ల్. భారీ యాక్షన్ మూవీ స్కంద 28న రిలీజ్ అవుతోంది. విడుదల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్.. ఫస్ట్ ట్రైలర్ కంటే ఎక్కువ ఆకట్టుకుంది. రామ్ ఇస్మార్ట్ శంకర్‌లో ఊరమాస్ లుక్‌లో కనిపించినా.. స్కందలో హై ఓల్టేజ్ యాక్షన్ డోస్‌తో కనిపిస్తున్నాడు. మరి బోయపాటి మాసిజం హీరోకు మాస్ ఇమేజ్ తీసుకొస్తుందేమో చూడాలి మరి.