450 కోట్లొచ్చినా టైం లేదు… 1000 కోట్ల సీన్ ఉన్న టైం బాలేదు…
పుష్ప రాజ్ రెండో సారి బాక్సాఫీస్ బెండు తీసేందుకు ఏకంగా 6 భాషల్లో రాబోతున్నాడు. ఐతే పుష్ప2 కి మొదట్నుంచి దేవరతోనే పోలికలు పెరిగాయి. దేవర విడుదలకుముందు ఎలాగైతే నెగెటీవ్ ప్రమోషన్ జరిగిందో, కామెంట్లు , ట్రోలింగ్స్ తో ఫిల్మ్ టీం ఇబ్బంది పడిందో, అలాంటీ సీనే పుష్ప 2 కి రిపీట్ అవుతోంది.
పుష్ప రాజ్ రెండో సారి బాక్సాఫీస్ బెండు తీసేందుకు ఏకంగా 6 భాషల్లో రాబోతున్నాడు. ఐతే పుష్ప2 కి మొదట్నుంచి దేవరతోనే పోలికలు పెరిగాయి. దేవర విడుదలకుముందు ఎలాగైతే నెగెటీవ్ ప్రమోషన్ జరిగిందో, కామెంట్లు , ట్రోలింగ్స్ తో ఫిల్మ్ టీం ఇబ్బంది పడిందో, అలాంటీ సీనే పుష్ప 2 కి రిపీట్ అవుతోంది. దేవర ఎలాగైతే ప్రీరిలీజ్ ఈవెంట్ లేకుండా విడుదలైందో.. అలానే పుష్ప 2 కూడా రిలీజ్ అయ్యే పరిస్థితొచ్చింది. పుష్ప మొదటి భాగం రిలీజ్ అయ్యే టప్పుడు అదంత హిట్ అవుతుందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. దీనికి తోడు నార్త్ ఇండియాలో ప్రమోట్ చేసేందుకు కావాల్సినంత టైంలేదు… ఇప్పుడు పుష్ప 2 కి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది. ఆకాశాన్నంటేంత అంచనాల గోల పెరిగింది. అన్నీంటికి మించి పుష్ప 2 ని ప్రమోట్ చేసేందుకు కావాల్సినంత టైం ఉంది.. 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అయిపోయింది… అయినా టైం బ్యాడంటున్నారంటే అర్ధమేంటి?
పుష్ప రిలీజ్ అయిన టైంలో ఎలాంటి ప్రమోషన్ తెలుగులోనే కాదు, మరే ప్రాతంలో చేయలేదు. కాని ఇది క్రికెటర్లు, నేషనల్ పొలిటీషియన్లు ఇలా అంతా సినిమా డైలాగ్ ని ఇమిటేట్ చేసే వరకు సీన్ మారిపోయింది. అంతగా పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టరైంది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అలా ఎలాంటి ప్రమోషన్ లేకుండానే 450 కోట్లు రాబట్టింది. ఐకాన్ స్టార్ ని నేషనల్ అవార్డు అందుకునేలా చేసింది.
అంతవరకు స్టోరీ బానే ఉంది.. ఎటొచ్చి పుష్ప 2 రిలీజ్ టైం దగ్గర పడుతుందటేనే రక్త కన్నీరు తప్పట్లేదు.. ఎందుకంటే పుష్ప 2 కి అన్నీ భయంకరంగా కలిసొస్తున్నా, ఏం చేయలేని అసహయ స్థితిలో ఉంది ఈ ఫిల్మ్ టీం. అచ్చం దేవర పరిస్థితే రిపీట్ అవుతోంది.
దేవర రిలీజ్ కిముందు భయంకరంగా పాటలు,టీజర్, ట్రైలర్ పేలటంతో, భారీ హైప్ వచ్చింది. ఆ దెబ్బకి సౌత్, నార్త్ లో ఎంతగా సినిమాను ప్రమోట్ చేసినా, తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయలేకపోయారు. ఆరేంజ్ ఏన్టిఆర్ ఫ్యాన్స్ ఈవెంట్ కి వస్తే, ఆ ఈవెంటే రద్దయింది. తర్వాత దసరా బందోబస్త్ కష్టాలు చెప్పి పోలీసులు పర్మీషన్ కూడా ఇవ్వలేదు
ఇప్పుడు పుష్ప 2 కి అదే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఏపీ, తెలంగాణలోనే కాదు, కేరళాలో కూడా పుష్ప 2 భారీ ఈవెంట్ కి పర్మీషన్ వచ్చేలా లేదట. క్రిస్మస్ దగ్గర పడుతుండటంతో, నవంబర్, డిసెంబర్ లో భారీ ఈవెంట్లకి అక్కడ పోలీసు బందో బస్తు కష్టమని తేల్చారు…
ఆల్రెడీ ఏపీ, తెలంగాణలో పోలీస్ పర్మీషన్ రావట్లేదు. పుష్ప 2 రిలీజ్ కిముందే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుండొచ్చు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీకి భారీగా క్రేజ్ ఉండొచ్చు. కాని వాటి వల్లే అభిమానుల తాకిడి పెరిగితే, వాళ్లని కంట్రోల్ చేసేంత పోలీస్ ఫోర్స్ ఈవెంట్ దగ్గరుండాలి… అంత ఫోర్స్ ఇప్పుడు ఇవ్వలేమని, కేరళా నుంచి కూడా సంకేతాలు అందుతున్నాయట.
అసలే అల్లు అర్జున్ కి మళ్లూ అర్జున్ అంటూ అక్కడా భారీ క్రేజ్ ఉంది.. సో పుష్ప కి ఎలాంటి ప్రమోషన్ చేయకున్నా 450 కోట్లొచ్చాయి. అప్పుడు టైంలేకపోయినా కాలం కలిసొచ్చింది. ఇప్పుడు రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజినెస్ అయినా, విడుదలకు ఇంకా టైం ఉన్నా, ప్రమోట్ చేద్దామంటే, పర్మీషన్లు దొరకట్లేదు. ఆన్ లైన్ ప్రమోషన్లు తప్ప మరోదారి కనిపించట్లేద.