3000 కోట్ల సీన్ ఉన్నా… వేయిట్ అండ్ సీ…

కల్కీ మూవీ 1200 కోట్ల వసూల్లు రాబట్టింది. సలార్ సినిమా 800 కోట్లు కొల్లగొట్టింది. మూమూలుగా బాహుబలి1, కేజీయఫ్ 1, పుష్ప1 ఇలా ఏ హిట్ మూవీ చూసినా అన్నీ, 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. వాటి సీక్వెల్స్ బాహుబలి 2, పుష్ప2, రెండూ కూడా 1850 కోట్లు రాబడితే, కేజీయఫ్ 2 మూవీ 1350 కోట్లు రాబట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2025 | 05:43 PMLast Updated on: Jan 31, 2025 | 5:43 PM

Even If There Is A 1000 Crore Scene Wait And See

కల్కీ మూవీ 1200 కోట్ల వసూల్లు రాబట్టింది. సలార్ సినిమా 800 కోట్లు కొల్లగొట్టింది. మూమూలుగా బాహుబలి1, కేజీయఫ్ 1, పుష్ప1 ఇలా ఏ హిట్ మూవీ చూసినా అన్నీ, 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. వాటి సీక్వెల్స్ బాహుబలి 2, పుష్ప2, రెండూ కూడా 1850 కోట్లు రాబడితే, కేజీయఫ్ 2 మూవీ 1350 కోట్లు రాబట్టింది. అంటే రెండు భాగాలుగా తీసే ఏ సినిమా అయినా ఫస్ట్ మూవీ హిట్ అయితే, సెకండ్ పార్ట్ అందుకు 3 రెట్లు వసూళ్లు రాబడుతుందని తేలింది. ఆ లెక్కన కల్కీ 2 రిలీజైతే, రికార్డులు బద్దలేనా? ఆ లెక్కన కల్కీ 2 మూవీకి 3 వేల కోట్లు వసూళ్లకి ఛాన్స్ ఉన్నట్టే. ఇక సలార్ సీక్వెల్ శౌర్యంగ పర్వం వస్తే 2400 కోట్ల పైనే రాబడుతుందని ఊహించొచ్చు… ఆరేంజ్ క్రేజ్ ఉన్న ప్రాజెక్టులు ఎందుకు డిలే అవుతున్నాయి. కల్కీ2 జూన్ లో మొదలౌతుందన్నారు. స్పిరిట్ కి ప్యార్ లల్ గా తెరకెక్క వచ్చన్నారు. కట్ చేస్తే ఎక్కడో ఏదో ప్లానింగ్ మారినట్టు కనిపిస్తోంది.. ఇంతకి 5500 కోట్ల వసూళ్ల ఛాన్స్ ని ఎవరు వాయిదా వేస్తున్నారు? ఎక్కడ లెక్కలు మారుతున్నాయి…? హావేలుక్

రెబల్ స్టార్ లాంటి కటౌట్ కి హిట్ పడితే వెయ్యికోట్ల వసూళ్లు కామన్. అలాంటి తనుకి ఆల్రెడీ 1200 కోట్ల హిట్ పడ్డాక, దాని సీక్వెల్ వస్తే సినీ సునామే. ఇది అందరికి తెలుసు కాని కల్కీ 2 కి మాత్రం చిత్ర విచిత్రమైన కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. మొన్నటి వరకేమో దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అవటం వల్ల అలా సీక్వెల్ ని వెంటనే ప్లాన్ చేయలేకపోయారు. ఇప్పుడు కల్కీ 2 కథ సిద్దం… టోటల్ టీం కూడా సిద్దం. దీపికా పదుకొనే కూడా డేట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ఎటొచ్చి రెబల్ స్టార్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావట్లేదు. కల్కీ 2ని తర్వాత స్టార్ట్ చేస్తామనే సరికి, ఈలోపే మిగతా మూవీలతో బిజీ అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు ఆ కమిట్ మెంట్లే కల్కీ 2 కొంపముంచేలా ఉన్నాయి. ది రాజా సాబ్ 20 రోజులు షూటింగ్ తో పూర్తువుతుంది. జూన్ లోగా ఫౌజీ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సో ఈరెండూ కూడా ఏరకంగా కూడా కల్కీ 2 కి సమస్య కాదు.
కాని స్పిరిట్ మూవీ మే లో మొదలు పెట్టి, వచ్చేఏడాది సమ్మర్ లోగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. తనని కన్విన్స్ చేసి ప్యార్ లల్ గా కల్కీ 2 తీసేందుకు నాగ్ అశ్విన్ అన్ని సిద్ధం చేసుకుంటుంటే, ప్రభాస్ మాత్రం కల్కీ 2 కి డేట్లిచ్చే పరిస్థితి లేదట. స్పిరిట్ కి తన లుక్ ని మార్చేయబోతున్న ప్రభాస్, కల్కీ 2 లో తన లుక్ కి న్యాయం చేయలేనని తేల్చేశాడట. ఆలెక్కన 2026 జనవరిలోనే కల్కీ 2 మొదలు పెట్టాలని తేల్చాడట ప్రభాస్.

సో 2026 బిగినింగ్ లో కల్కీ 2 మదలైతే, 2027 దసరాకో, దీపావలికో రిలీజ్ అయ్యే ఛాన్స్ఉంది. మరి సలార్ పరిస్థితేంటి? దాని పరిస్థితి మరీ ఘోరం. 2028 వరకు సలార్ 2 కి మోక్షమే లేదు. ఎందుకంటే కల్కీ 2 అయ్యే వరకు సలార్ 2 ని ప్రభాస్ టచ్ చేసే అవకాశమే లేదట. అంటే డ్రాగన్ ని ఈ ఏడాది ఎండ్ లోగా పూర్తి చేస్తే, 2027 బిగినింగ్ వరకు ప్రశాంత్ నీల్ ఖాలీగానే ఉండాలి…
ఏదేమైనా కల్కీ 2, మూవీ 2027 దసరాకు, సలార్ 2 ని 2028 దసరాకు ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్ 2026 దసరాకి అనుకుంటున్నారు. అంటే వరకుసగా మూడు దసరాలను రెబల్ స్టారే ఆక్యుపై చేసే ఛాన్స్ఉంది. వేల కోట్ల వసూళ్ల వరదకి దసరానే కేరాఫ్ అడ్రస్ అయ్యేలా ఉంది.