Jr. NTR: ప్లానింగ్ లో జూనియర్ ఎన్టీఆర్‌ని కొట్టెవాళ్లే లేరు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మధ్యలో వచ్చే గ్యాప్ ని కూడా వదలట్లేదు ఈ హీరో.

Even in his busy schedule, Jr. NTR is ready to do a movie with Prashant Neil
అల్లు అర్జున్ పుష్ప2 రిలీజ్ డేట్ ఎప్పుడో మేకర్స్‌కే తెలీయడం లేదు. ఎందుకంటే ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు. రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్.. ప్రభాస్, మారుతి సినిమాలు సంగతి సరేసరి. అయితే.. ఓ స్టార్ హీరో ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదు. వరుసగా మూడు సినిమాల షూటింగ్స్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్, బన్నీ గ్యాప్‌లో పడిపోయారు. ఈ ఏడాది వీళ్లిద్దరూ ఒక్క సినిమా కూడా రావడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న దేవరపై తారక్ ఫుల్ క్లారిటీతో వున్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అనుకున్న ప్రకారమే.. అనుకున్న షెడ్యూల్లో పూర్తవుతోంది. ముందే చెప్పినట్టు.. ఏప్రిల్ 5న రావడం గ్యారెంటీ.
డిసెంబర్ నాటికి దేవర షూటింగ్ పూర్తిచేసిన వెంటనే తారక్ అమెరికా వెళ్లి కండలు పెంచుతాడట. అందుకు ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో ఇక్కడే వర్కవుట్స్ చేస్తుంటే.. తారక్ మాత్రం వార్2 కోసం.. అమెరికా వెళ్లి మేకోవర్ అవుతాడని తెలిసింది. వార్2 జనవరి చివర్లో లేదంటే ఫిబ్రవరి మొదట్లో సెట్స్ పైకి వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యూచర్ ఫ్లాన్స్ మామూలుగా లేదు. అన్ని సినిమాలను సెట్ చేసేస్తున్నాడు. వార్2 పూర్తి కాకుండానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ జాయిన్ అవుతాడు. సెప్టెంబర్ 28న ‘సలార్’ రిలీజ్ కాగానే.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాను వండే పనిలో పడతాడు. 2024 సమ్మర్ నాటికి స్కిప్ట్ రెడీ చేయడంతోపాటు.. సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తాడట. ఇలా దేవర.. వార్2… ప్రశాంత్‌నీల్ మూవీని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు.