రష్మికతో రిలేషన్ లో ఉన్నా… అనౌన్స్మెంట్ అప్పుడే, విజయ్ క్లారిటీ
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన అలాగే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది.
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన అలాగే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇద్దరు ఇండైరెక్టుగా క్లారిటీ ఇవ్వటంతో వ్యవహారం మరింత హాట్ హాట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ… రష్మిక మందనతో కలిసి మాల్దీవ్స్ సహా ఎన్నో టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్లడం అదేవిధంగా విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సహా కొన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.
రీసెంట్ గా విజయ్ దేవరకొండ కాస్త ఓపెన్ అయ్యాడు. తాను తన కోస్టార్ తో రిలేషన్ లో ఉన్నానని కచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందంటూ కామెంట్ చేశాడు. ఇక రష్మిక కూడా తన ప్రేమ వ్యవహారం గురించి ఇన్ డైరెక్ట్ గా ఒక ఈవెంట్ లో కామెంట్స్ చేసింది. దీనితో వీళ్ళిద్దరూ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడం ఖాయం అంటూ ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుత రష్మిక చేతిలో సినిమాలు ఫుల్లుగా ఉండటంతో ఆమె ఖాళీగా లేదని అందుకే వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చని టాలీవుడ్ జనాలు వెయిట్ చేస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమాతో హిట్టు కొట్టి పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని పట్టుదలగా ఉన్నాడంటూ ప్రచారం మొదలైంది. ఈ టైంలో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రష్మిక మందనాతో డేటింగ్ లో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయిన విజయ్ దేవరకొండ దీనిపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తా అన్నాడు. ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటుందో అప్పుడే నేను బయట పెడతా అంటూ ఇండైరెక్టుగా హింటిచ్చాడు.
దీనికోసం ఒక సందర్భం రావాలని నేను ఒక యాక్టర్ ను కావడంతో నా జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారని ఈ విషయంపై నాలో ఎలాంటి ఒత్తిడి లేదని ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే రష్మిక పుష్ప సినిమా కారణంగా బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు పెళ్లి వాయిదా వేసింది అని మరి కొంతమంది కామెంట్ చేశారు. ఏది ఎలా ఉన్నా వీళ్ళిద్దరి వ్యవహారం మాత్రం అటు కన్నడ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతుంది. గతంలో రష్మిక కన్నడ స్టార్ హీరోతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందో లేదో.