విలన్ కోసం 40 కోట్లా..? ఇదెక్కడి పాన్ వరల్డ్ రెమ్యునరేషన్ జక్కన్న..?

రాజమౌళి సినిమా అనగానే ప్రతి ఒక్కటి స్పెషల్ గానే ఉంటుంది. జక్కన్న కూడా జనాలకు నచ్చే విధంగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 12:15 PMLast Updated on: Feb 11, 2025 | 12:15 PM

Every Rajamouli Movie Is Special

రాజమౌళి సినిమా అనగానే ప్రతి ఒక్కటి స్పెషల్ గానే ఉంటుంది. జక్కన్న కూడా జనాలకు నచ్చే విధంగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. సినిమా రిలీజ్ చేస్తే ఏదో సాదాసీదాగా రిలీజ్ చేసి సక్సెస్ కొట్టడం కంటే చరిత్రలో నిలిచిపోవాలనేది జక్కన్న ప్లాన్. అందుకే ఇప్పుడు తన సినిమాల విషయంలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చాలా జాగ్రత్తగా గోడ కట్టినట్టు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాకు తానేంటి అనేది చూపించిన జక్కన్న త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లిపోయాడు.

ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు జక్కన్న. ఈ సినిమాతో ఎలాగైనా సరే హాలీవుడ్ కు టచ్ అవ్వాలని, హాలీవుడ్ లో తన గురించి చర్చ జరగాలని జక్కన్న టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు హాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమాను మాట్లాడుకునే రేంజ్ లో తీసుకెళ్లేందుకు సిద్ధమైపోతున్నాడు. తొలిసారి మహేష్ బాబుకు విలన్ గా ఒక లేడీని పరిచయం చేయబోతున్నాడు జక్కన్న. హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన ప్రియాంక చోప్రాను తన సినిమా కోసం సెలెక్ట్ చేసిన జక్కన్న… ఆమెకు హీరోయిన్ పాత్ర కాకుండా విలన్ పాత్రను ఫైనల్ చేశాడు.

ఇందుకోసం భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా జక్కన్న వెనకాడ లేదు. ఆమెకున్న క్రేజ్ తన సినిమాకు కచ్చితంగా పనికొస్తుందని, అలాగే లేడీ విలన్ అయితే కచ్చితంగా సినిమాకు ప్లస్ అయిపోతుందని జక్కన్న టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా కూడా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. ఇక ఈ సినిమాకు ప్రియాంక చోప్రా కి ఇస్తున్న రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ అవుతుంది. దాదాపు రెండేళ్లపాటు ప్రియాంక డేట్స్ అడిగిన రాజమౌళి… ఇప్పుడు ఆమెకు దాదాపు 35 నుంచి 40 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

ముందు ఆమెకు 30 కోట్లనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో ఐదు నుంచి పది కోట్లు పెరిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం ఈ సినిమా మూడు పార్ట్ లు కాబట్టి ఒక్కో పార్ట్ కు 10 కోట్లు చొప్పున ముందు 30 కోట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ ఎక్కువ టైం కేటాయించాల్సి రావటంతో ఆ రెమ్యూనరేషన్ పెరుగుతోందట. ఇక ఒక విలన్ కోసం ఇప్పటివరకు ఏ సినిమాలోనో ఈ రేంజ్ లో ఖర్చు పెట్టలేదు. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో హైయెస్ట్ పెయిడ్ విలన్లు చూస్తే కమలహాసన్ కల్కి సినిమా కోసం దాదాపు 25 కోట్లు తీసుకున్నారు. ఇక విజయసేతుపతి షారుక్ ఖాన్.. జవాన్ సినిమాలో విలన్ గా నటించినందుకు 21 కోట్లు తీసుకున్నాడు. ఇక సైఫ్ అలీఖాన్ ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో కనిపించడానికి పది కోట్లు ఛార్జ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.