Prabhas: సలార్ లో కేజీయఫ్ నిజమే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్..
సలార్ టీజర్ చూస్తే కేజీయఫ్ ని చూస్తున్నట్టే ఉందన్నారు. చూసినట్టే కాదు, అదే నిజం అనేస్తున్నాడు ప్రశాంత్ నీల్. నిజమే సలార్ టీజర్ లో చూపించిన లొకేషన్లు కేజీయఫ్ లోనివేనట. అలాని ఇది కేజీయఫ్ కి కంటిన్యూయేషన్ కాదు. 90శాతం సలార్ ప్రపంచమే వేరని, ఫిల్మ్ టీం ఇచ్చిన లీకులతో తేలిపోతోంది.. ఆ స్టోరీ ఏంటో చూసేయండి.
సలార టీజర్ చూసి ఫ్యాన్స్ తో పాటు చాలా మందీ ఫిదా అయ్యారు .కొందరు మాత్రం ఇది మరో కేజీయఫ్ లా ఉందన్నారు. అలాంటి కామెంట్లకి ఆన్సర్ దొరికింది. ఇది మరో కేజీయఫ్, కాదు యాజ్ ఇట్ ఈజ్ కేజీయఫే.. అలాని కేజీయఫ్ 2 కి సీక్వెల్ కాదు. ఇదే విషయం ఫిల్మ్ టీం క్లియర్ చేసింది.
అసలు సంగంతేంటంటే, కేజీయఫ్ లోని సెట్లు, సినిమాటోగ్రఫి, మేకింగ్ స్టైల్ అంతా సలార్ లో కూడా రిపీట్ అయ్యిందా అన్నారు. నిజమే అవే సెట్లు, అదే లొకేషన్లు సలార్ లో కూడా వాడారట. కారణం, కథ పరంగా సలార్ లో ప్రి క్లైమాక్స్ కి కేజీయఫ్ మూవీతో లింకు ఉండటమే. అంటే సలార్ లో యష్ కూడా కనిపిస్తాడని ఫైనలైంది.
ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్న సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా, సలార్ లో కేజీయఫ్ సీన్లు లొకేషన్లు వాడారట. అది కూడా కేవలం ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ తో లింక్ చేసి అని తెలుస్తోంది. కాబట్టి సలార్ టీజర్ లో చూపించినట్టు సినిమా అంతా కేజీయఫ్ మోడ్ లో ఉండదట.
అమెరికన్ ఫార్మా మాఫియా, ప్రైవేట్ ఆర్మీతో ఫైట్ చేసి దేశం కోసం పోరాడే ఓ ఫైటర్, తన స్నేహితుడి కోసం ఫ్లాష్ బ్యాక్ సీన్ లో కేజీయఫ్ లోకి ఎంటరౌతాడట.. అది తప్ప మిగతాదంటా సలార్ లో వేరే ఉంటుందని, కాబట్టి సలార్ టీజర్ బట్టి ఇది మరో కేజీయఫ్ అనుకోవాల్సిన పనిలేదని, ఫిల్మ్ టీం ఇస్తున్న లీకులతో తేలిపోయింది.