prabhas : ప్రభాస్ కి విలన్ గా కొరియన్ యాక్టర్
ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతుంది. రెబెల్ స్టార్ నుంచి సినిమా వస్తే.. కలెక్షన్ల సునామీ ఖాయం. అయితే.. ఒక సినిమా ఇంకా పట్టాలెక్కకుండానే ఆ చిత్రం సృష్టించే సంచలనాలు ఓ రేంజులో ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.

Everything Prabhas touches turns into gold. If there is a movie from Rebel Star... there is sure to be a tsunami of collections.
ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతుంది. రెబెల్ స్టార్ నుంచి సినిమా వస్తే.. కలెక్షన్ల సునామీ ఖాయం. అయితే.. ఒక సినిమా ఇంకా పట్టాలెక్కకుండానే ఆ చిత్రం సృష్టించే సంచలనాలు ఓ రేంజులో ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. అదే ‘స్పిరిట్’. అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ కాలపు సెన్సేషనల్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న సందీప్.. ‘స్పిరిట్’తో ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీ తెరకెక్కించబోతున్నాడు.
ఇప్పటివరకూ ప్రభాస్ ను పోలీస్ యూనిఫామ్ లో చూడలేకపోయాము అనే ఆవేదన అభిమానుల్లో ఉంది. ఆ కోరికను ‘స్పిరిట్’తో తీర్చబోతున్నాడు సందీప్. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తిచేసుకుంటోన్న ‘స్పిరిట్’ కోసం లేటెస్ట్ గా ప్రభాస్ కి ధీటైన విలన్ ని సెట్ చేశాడట సందీప్ రెడ్డి. సౌత్ కొరియన్ యాక్టర్ మా డాంగ్ సియోక్ ని ‘స్పిరిట్’లో మెయిన్ విలన్ గా తీసుకోబోతున్నాడట. ‘స్పిరిట్’ని సినిమా కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లో మాత్రమే కాకుండా.. చైనీస్, కొరియన్ లాంగ్వేజెస్ లో తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాలో అతన్ని ప్రతినాయకుడిగా ఎంపిక చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లనుంది.