Bigg Boss 7 : అర్జున్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్.. కానీ అంతలోనే.. ట్విస్ట్ మీద ట్విస్ట్ ..?

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) ఇప్పటికే పది వారాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక మిగిలింది ఐదు వారాలు మాత్రమే కావడంతో కంటెస్టెంట్స్ కసిగా ఆడుతున్నారు. గెలుపు కోసం మీని యుద్ధం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 11:10 AMLast Updated on: Nov 16, 2023 | 11:10 AM

Eviction Free Pass To Arjun But In The Meantime Twist On Twist

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) ఇప్పటికే పది వారాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక మిగిలింది ఐదు వారాలు మాత్రమే కావడంతో కంటెస్టెంట్స్ కసిగా ఆడుతున్నారు. గెలుపు కోసం మీని యుద్ధం చేస్తున్నారు. విన్నర్ గా నిలిచేందుకు ఎవరికి వారు తమ స్ట్రాటజీని వాడుతుంటే.. బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ (Eviction Free Pass) కోసం పోటీ నిర్వహించాడు. హౌస్ లో జరిగిన ఈ గేమ్ .. రంజుగా సాగింది. అంతేకాక ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి కంటెస్టెంట్స్‌కు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

హౌస్ లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ ( Bigg Boss 7, Contestants) ని ఎవరు స్థానం ఏంటో మీరే తేల్చుకుని మీరు ఏ స్థానం లో అయితే ఉండాలని అనుకుంటున్నారో ఆ స్థానంలో నిలబడాలని బిగ్ బాస్ చెప్పారు. దీంతో టాప్ 5 నంబర్స్ కోసం కంటెస్టెంట్స్ తన్నుకున్నారు. కొందరికి వారు అర్హులు అనుకున్న స్థానాలు దక్కకపోయినా.. దొరికిన స్థానంతో సర్దుకుపోయారు. అలా స్థానాలను డిసైడ్ చేసుకున్న తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి బయటపెట్టాడు బిగ్ బాస్. టాప్ 6 నుంచి 10 వరకు ఉన్న సభ్యులు గేమ్ లో పాల్గొనాలని కంటెస్టెంట్స్ కి సూచించాడు. దీంతో లిస్ట్ లో అర్జున్, అమర్‌దీప్, గౌతమ్, అశ్విని, రతిక లకు పజిల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో అద్భుతంగా ఆడి అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను సొంతం చేసుకున్నాడు. కానీ ఇంతటితో ఆట ముగిసిపోలేదని బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ అర్జున్ చేతిలో ఉంది కాబట్టి టాప్ 1 నుంచి 5 స్థానాల్లో ఒకరితో పోటి పడాలని అర్జున్ కు బిగ్ బాస్ సూచించాడు. అంతేకాక ఎంపిక చేసుకునే అవకాశం కూడా అర్జున్‌కే ఇవ్వడంతో యావర్‌ను ఎంపిక చేస్తున్నాడు. అయితే ఈ పోటీలో ఎవరు ఓడిపోయినా.. మరోసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం ఉండదని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్‌లో అర్జున్, యావర్ కదులుతున్న బోర్డ్‌పై నిలబడి పోల్స్‌పై అయిదు బాల్స్‌ను నిలబెట్టాలని సూచించాడు. అంతేకాక బాల్ కింద పడిపోయిన.. బోర్డ్‌పై నుంచి దిగి కంటెస్టెంట్సే బాల్‌ను తిరిగి తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఈ టాస్క్‌లో అర్జున్‌ కంటే యావర్ ముందుగా బాల్స్‌ను బ్యాలెన్స్ చేసి ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గెలుచుకున్నాడు. ఇందులో ఓడిపోవడంతో అర్జున్ ఇక పూర్తిగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను కాపాడుకోవడానికి యావర్ ఎవరితో పోటీపడాలో తెలియాలంటే వేచిచూడాల్సిందే.