ఫస్ట్ టైం 1000 కోట్లు.. ఫస్ట్ టైం ఆ కథ.. ఫస్ట్ టైం AI టెక్నాలజీ..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ మీద అంచనాలు పెంచేస్తున్నాయి విజయేంద్ర ప్రసాద్ మాటలు. ఫస్ట్ టైం ఇండియాలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న హెవీ బడ్జెట్ మూవీగా ఆల్రెడీ ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ టైం ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ తో రాబోతున్న సినిమా గా కూడా చరిత్ర స్రుష్టంచబోతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ మీద అంచనాలు పెంచేస్తున్నాయి విజయేంద్ర ప్రసాద్ మాటలు. ఫస్ట్ టైం ఇండియాలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న హెవీ బడ్జెట్ మూవీగా ఆల్రెడీ ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ టైం ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ తో రాబోతున్న సినిమా గా కూడా చరిత్ర స్రుష్టంచబోతోంది. ఇప్పుడు జోనర్ విషయంలో కూడా ఇదే ఇండియా ఫస్ట్ మూవీ అనంటున్నాడు విజయేంద్ర ప్రసాద్. బేసిగ్గా తను బాహుబలి 2 తర్వాత బాహుబలి 3 ఉంటుందన్నాడు. మూడో బాహుబలి కూడా ఉండొచ్చని ఊరించాడు. తర్వాత త్రిబుల్ ఆర్ హిట్టయ్యాక త్రిబుల్ ఆర్ 2 ప్లాన్ చేస్తున్నామన్నాడు. ఇవన్నీ కేవలం బాహుబలి 2, త్రిబుల్ ఆర్ ఊపు మీదున్నప్పుడు, జనాల్లో మరింత ఊపు తెచ్చేందుకు అన్నాడన్నారు. అచ్చంగా అలానే మహేశ్ బాబు మూవీ మీద హైప్ పెంచేందుకే విజయేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడుతున్నాడా..? రాజమౌళి సినిమాకు హైప్ పెంచాల్సిన పనిలేదు. కాని ఎందుకో రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాటలు మిస్ ఫైర్ అవుతున్నాయా..? హావేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో రాజమౌలి తీస్తున్న మూవీ, వర్కింట్ టైటిల్ గోల్డ్. మహారాజా అని కూడా ప్రచారం జరిగింది. అదెలా ఉన్నా, ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎన్నడూ చూడని కొత్త జోనర్ మూవీ అన్నాడు రైటర్ కమ్ రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్. అడవిలో అద్బుతాల వేట, దీనికి కౌడ్ బాయ్ బ్యాక్ డ్రాప్, అలానే డ్రగ్ మాఫియా సైడ్ ట్రాక్, అన్నీంటికి మించి నైంటీంథ్ సెంచరీ స్టార్టీంట్ టైం పీరియడ్ లో తెరకెక్కుతోన్న సినిమా…
ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో 10 రోజుల ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. ప్రియాంక చోప్రా మాత్రం చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వస్తానంటూ తన బ్రదర్ సిద్ధార్థ్ చోప్రా పెల్లికి వెళ్లింది. ఐదు రోజుల తర్వాత మళ్లీ రాజమౌళి టీంతో జాయిన్ కాబోతోంది ప్రియాంక. అంతా కలిసి కెన్యాకి జెండా ఎత్తేసేలా ఉన్నారు. అక్కడ అంబోసేలి నేషనల్ పార్క్ , మౌంట్ కిలిమంజారో, లోనే 30శాతం వరకు సీన్లు తెరకెక్కబోతున్నాయి.
ఏనుగులు, పులులు, హైనా, జిరాఫీ వీటి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. ఐతే బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి మూవీల తర్వాత కంప్లీట్ డిఫరెంట్ రూట్లో ఈసారి కథ సిద్ధం చేశామన్నాడు రైటర్ విజయేంద్రప్రసాద్. 1000 కోట్ల భారీ బడ్జెట్ తోఇంతవరకు ఇండియాలో ఒక్క సినిమా కూడా రాలేదు. రామాయణ్ 1500 కోట్ల తో తెరకెక్కుతున్నా, 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి, ఒక్కో భాగానికి 500 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది
సో బడ్జెట్ మాత్రమే కాదు ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ తో యానిమల్స్ ని రీక్రియేట్ చేసిందట ఫిల్మ్ టీం. రియాలిస్టిక్ యానిమల్స్ కి ఏమాత్రం తీసి పోని విధాంగా యానిమల్స్ని, త్రీడీ రూపంలో అది ఏఐ లో క్రియేట్ చేశారు.వాటినే కెమెరాకి కనెక్ట్ చేసి వర్చువల్ స్టూడియో రూపంలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇలాంటి ప్రయత్నం హాలీవుడ్ లో కూడా జరిగినా, పూర్తి స్థాయిలో ఏఐనీ సినిమా మొత్తానికి వాడింది లేదు.
ఏదేమైనా కౌబాయ్ పాత్రకి మాఫియాని యాడ్ చేయటం, ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచరస్ జర్నీ చేసే హీరో, ప్రపంచాన్ని కాపాడడం అన్న పాయింట్ తో రాబోతోంది ఈ మూవీ. ఇదేంవిజయేంద్ర ప్రసాదో, రాజమౌళినో రివీల్ చేయలేదు. కాని వాళ్లిద్దరికి ఇష్టమైనా సౌత్ ఆఫ్రికా నవలా రచయిత, బెస్ట్ నవలల కథలు అవే… అందుకే ఇండియానా జోన్స్ లాంటి మూవీకి ఇండియన్ వర్షన్ ని రాజమౌళి రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.