BOLLYWOOD GIFTS : అనంత్-రాధికకు ఖరీదైన గిఫ్టులు.. పోటీలు పడ్డ బాలీవుడ్ స్టార్స్
ప్రీవెడ్డింగ్ (Prewedding) ఈవెంట్ సందర్భంగా అతిథుల నుంచి కళ్ళు చెదిరే గిఫ్టులు అందుకున్నారు అనంత్ అంబానీ – రాధికా. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటాయి. బాలీవుడ్ (Bollywood) నటులు, క్రికెటర్లు కూడా కాస్ట్ లీ గిఫ్ట్స్ అందించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, ఆలియా భట్, కైరా అద్వానీ (Kiera Advani) ఇలా ప్రతి ఒక్కరూ కొత్త పెళ్ళికొడుకు... పెళ్ళికూతురుకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చారు.

Expensive gifts for Ananth-Radhika.. Bollywood stars who competed
ప్రీవెడ్డింగ్ (Prewedding) ఈవెంట్ సందర్భంగా అతిథుల నుంచి కళ్ళు చెదిరే గిఫ్టులు అందుకున్నారు అనంత్ అంబానీ – రాధికా. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటాయి. బాలీవుడ్ (Bollywood) నటులు, క్రికెటర్లు కూడా కాస్ట్ లీ గిఫ్ట్స్ అందించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, ఆలియా భట్, కైరా అద్వానీ (Kiera Advani) ఇలా ప్రతి ఒక్కరూ కొత్త పెళ్ళికొడుకు… పెళ్ళికూతురుకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చారు. జామ్ నగర్ (Jam Nagar) లో మూడు రోజుల పాటు జరిగిన అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకలకు అతిరధ మహారధులు తరలివచ్చారు. వాళ్ళకు శుభాకాంక్షలు చెబుతూ బాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన గిఫ్టులపై ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.
రణబీర్ కపూర్, ఆలియా భట్ కలసి… అనంత్ కి ఎయిర్ జోర్డాన్ షూస్… రాధికకు గుక్కీ బ్రాండ్ కు చెందిన డైమండ్స్ సెట్ బహుకరించారు. సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా అనంత్ కోసం ఖరీదైన వాచీని తయారు చేయించి పట్టుకొచ్చారు. రాధికకు డైమండ్ ఇయర్ రింగ్స్ బహుకరించాడు. షారూఖ్ ఖాన్ అయితే 5 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ 300 SLR కారును దంపతులకు గిఫ్ట్ గా ఇచ్చాడు.
సిద్ధార్థ మల్హోత్రా, కైరా అద్వానీ… గోల్డ్ అండ్ డైమండ్ గణేష్ తో పాటు లక్ష్మీ దేవీ అమ్మవారి బొమ్మలను అనంత్, రాధికకు అందించారు. అనంత్ అక్క ఇషా అంబానీకి కైరా అద్వానీ చిన్నప్పటి స్నేహితురాలు. ఇక విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ కలసి… డైమండ్ బ్రాస్ లెట్, నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు. దీపికా పడుకొనే, రణవీర్ సింగ్… కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచీలను ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చారు. ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు కూడా చాలా ఖరీదైన గిఫ్టులను కాబోయే దంపతులు అనంత్, రాధికకు అందించారు. వీళ్ళ పెళ్ళి జులై 12న జరగబోతోంది.