సంక్రాంతికి వస్తున్నాం ఫేక్ కలెక్షన్స్, బాంబు పేల్చిన డిస్ట్రిబ్యూటర్
ఈ మధ్యకాలంలో సినిమాల కలెక్షన్లు 1000 కోట్లు 1200 కోట్లని వస్తే జనాలు నవ్వుకుంటున్నారు. కలెక్షన్లు రాకపోయినా సినిమా ప్రమోషన్ కోసం రికార్డుల కోసం అబద్ధాలు చెబుతున్నారు అనే కామెంట్స్ గట్టిగానే వినపడుతున్నాయి.
ఈ మధ్యకాలంలో సినిమాల కలెక్షన్లు 1000 కోట్లు 1200 కోట్లని వస్తే జనాలు నవ్వుకుంటున్నారు. కలెక్షన్లు రాకపోయినా సినిమా ప్రమోషన్ కోసం రికార్డుల కోసం అబద్ధాలు చెబుతున్నారు అనే కామెంట్స్ గట్టిగానే వినపడుతున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా విషయంలో అలాగే గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఈ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ అసలు నిజం కాదని చాలామంది కామెంట్ చేశారు. కేవలం రికార్డులు బద్దలు కొట్టామని చెప్పుకోవడానికి పుష్ప 2 సినిమా కలెక్షన్స్ ను ఆ రేంజ్ లో అనౌన్స్ చేశారని.. ఇప్పటికీ చాలామంది కామెంట్ చేస్తూనే ఉంటారు.
భారీ అంచనాలతో వచ్చిన ప్రతి సినిమా గురించి కలెక్షన్స్ విషయంలో ఇలాగే ప్రచారం చేస్తున్నారు జనాలు. లాస్ట్ ఇయర్ వచ్చిన దేవరా సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా విషయంలో కూడా ఇలాగే పోస్టర్స్ హడావిడి చేశాయి. అయితే అది నిజం కాదని చాలామంది యాక్టర్స్ కూడా ఇప్పటికే కామెంట్ చేశారు. ప్రొడ్యూసర్లు కూడా ఈ మధ్యకాలంలో కాస్త నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు వేస్తున్న కలెక్షన్ పోస్టర్లు చూసి ఐటి అధికారులు కూడా గట్టిగానే దృష్టి పెడుతున్నారు.
ఈ మధ్యకాలంలో హైదరాబాదులో ఐటి అధికారుల దాడులు సెన్సేషన్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా దిల్ రాజు నిర్మించిన సంక్రాంతి వస్తున్నాం అనే సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టింది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వరుసగా 8వ సినిమా హిట్ కావడంతో ఆయన స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిందని సినిమా మేకర్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపుగా 300 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసిందని ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ సినిమా లాభాల బాట పట్టడంతో సినిమా యూనిట్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ఈ సినిమా అందుకున్న భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మీట్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ డిస్ట్రిబ్యూటర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒక సినిమా సక్సెస్ అయితే ప్రేక్షకులే తమకు లాభాలు ఇస్తారని అంతేగాని డిస్ట్రిబ్యూటర్ అబద్ధం ఆడిన నిర్మాత అబద్ధం ఆడిన మీడియా అబద్ధం ఆడిన ప్రేక్షకులు నమ్మడం లేదని అన్నారు. భారీ ఫిగర్స్ తో పోస్టర్స్ వేస్తుంటే జనం నవ్వుకుంటున్నారని ఆయన కామెంట్ చేశాడు. ఇక మీడియా సంస్థలు కూడా ఆ కామెంట్స్ ను అంగీకరించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.