FAMILY STAR: విజయ్‌ని మోసం చేశాడు కాబట్టే.. ఫ్యూచర్ మటాష్..

పరశురామ్ మీద భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఏకంగా రాడ్‌ని వంచి ముంచాడనంటున్నారు. విచిత్రం ఏంటంటే, రౌడీ స్టార్‌ని మోసం చేసిన ప్రతీ దర్శకుడికి కాలం కాటేస్తోంది. ఇదేదో శాపమో, విజయ్ మీద ప్రకృతికి ఉన్న అనుబంధమో అని చెప్పలేం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2024 | 08:11 PMLast Updated on: Apr 06, 2024 | 8:11 PM

Family Star Director Parasuram Facing Criticism About Movie

FAMILY STAR: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్‌గా డైరెక్టర్‌ని నమ్మి మరోసారి మోసపోయాడు. లైగర్, ఖుషీ సినిమాలతో పంచ్ పడిందని, పరశురామ్ మళ్లీ తనకి గీతా గోవిందం లాంటి బ్రేక్ ఇస్తాడని నమ్మాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు. కట్ చేస్తే అది డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పరశురామ్ మీద భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఏకంగా రాడ్‌ని వంచి ముంచాడనంటున్నారు. విచిత్రం ఏంటంటే, రౌడీ స్టార్‌ని మోసం చేసిన ప్రతీ దర్శకుడికి కాలం కాటేస్తోంది.

KALKI 2898 AD: షాకింగ్.. ప్రభాస్ సినిమా బిజినెస్ అన్ని కోట్లా..?

ఇదేదో శాపమో, విజయ్ మీద ప్రకృతికి ఉన్న అనుబంధమో అని చెప్పలేం. కాని.. రియాలిటీ చెక్ చేస్తే అలానే ఉంది. నిజం.. లైగర్ ఫ్లాప్ ఇచ్చిన పూరీ అంటే సౌత్, నార్త్ హీరోలంతా భయపడి దూరం వెళ్ళిపోయారు. ఒక్క రామ్ మాత్రమే కలిసొచ్చిన కాన్సెప్ట్ కదా అని ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేస్తున్నాడు. ఇక ఖుషీ లాంటి వీక్ కంటెంట్‌తో సినిమా తీసి విజయ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిన శివనిర్వాణకి కూడా ఆఫర్లు ఆవిరయ్యాయి. విచిత్రం ఏంటేంటే పూరీ, శివ నిర్వాణకు ఫ్లాపులు పడ్డాకే సీన్ రివర్స్ అయ్యింది. కాని ఫ్యామిలీ స్టార్ తీయకముందే పరశురామ్ మీద పరిస్థితులు పగపట్టాయి. తను నాగచైతన్యతో సినిమా తీయాల్సింది. కాని లక్ కలిసొచ్చిందని మహేశ్ బాబు మూవీ సర్కారు వారిపాట తీశాడు. అక్కడ పంచ్ పడింది. నాగచైతన్య కూడా పరశురామ్‌ని సెల్ఫిష్ అనే అర్ధం వచ్చేలా కామెంట్ చేశాడు.

ఇక అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ కావాల్సి ఉంది. కాని దిల్ రాజు 12 కోట్ల ఆఫర్‌కి టెమ్ట్ అయిన పరశురామ్ ఇలా విజయ్‌తో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయాల్సిన మూవీని దిల్ రాజు ప్రొడక్షన్‌లో తీశాడు. ఫలితం శూన్యం. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్‌తో అటు హిట్ రాలేదు, ఇటు డైరెక్టర్ క్యారెక్టర్ మీద మచ్చపడింది.