FAMILY STAR: చిరంజీవి.. జగపతిబాబు బాటలోనే విజయ్ దేవరకొండ

గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లోవస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. టైటిల్ ఫ్యామిలీ స్టార్ అని ఉన్నా, కంటెంట్‌లో మాస్ ఆడియన్స్‌కి కావాల్సినంత మ్యాటర్ ఉండేలా జాగ్రత్త పడింది ఫిల్మ్ టీం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 05:51 PMLast Updated on: Mar 05, 2024 | 5:51 PM

Family Star Movie Inspired From Megastars Gang Leader

FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ వచ్చినప్పుడు ఇది మెగాస్టార్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్‌కి కాపీ అన్నారు. అలా ప్రచారం చేశారు. ఇప్పుడు టీజర్ వచ్చింది. అంతే అటు గ్యాంగ్ లీడర్, ఇటు జగపతి బాబు మూవీ బడ్జెట్ పద్మనాభం మూవీకి కాపీ అనేస్తున్నారు. లేదు ప్రేరణ అని మరోబ్యాచ్ మాట పెంచింది. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లోవస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్.

Nayanthara: విడాకులపై క్లారిటీ.. వైరల్‌గా నయనతార ముద్దుల వీడియో..

టైటిల్ ఫ్యామిలీ స్టార్ అని ఉన్నా, కంటెంట్‌లో మాస్ ఆడియన్స్‌కి కావాల్సినంత మ్యాటర్ ఉండేలా జాగ్రత్త పడింది ఫిల్మ్ టీం. అయితే గ్యాంగ్ లీడర్‌లో హీరో ఎంతగా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తాడో.. అలా ఫ్యామిలీ స్టార్‌లో హీరో పాత్రని డిజైన్ చేశారట. ఇక జగపతి బాబు మూవీ బడ్జెట్ పద్మనాభంలో తన సొంతిల్లుని సొంతం చేసుకునేందుకు డబ్బుని పొదుపుచేసే వ్యక్తిలా హీరో కనిపిస్తాడు. ఈరెండింటిని కలిపితే అదే ఫ్యామిలీ స్టార్ అంటున్నారు. ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చాకే అచ్చంగా గ్యాంగ్ లీడర్‌లో చిరుని పెళ్లి కాకుండానే భర్తగా భావించే విజయ శాంతిలా మృణాల్ ఠాకూర్ ఏవండి.. అంటుంది.

ఇక తనని డ్రాప్ చేయమంటే లీటర్ పెట్రోల్ పోయించమని బడ్జెట్ పద్మనాభంలా మాట్లాడతాడు విజయ్. కేవలం ఆ పోలికలే కాదు, స్టోరీ డిస్కర్షన్‌లో ఆ రెండు పాత్రల పేర్లు రావటం వల్ల, తన టీం బయటికిచ్చిన ఫీలర్స్ వల్లే ఇలాంటి కామెంట్స్ పెరిగాయి.