జూ.ఎన్టీఆర్ కు అవమానం… మళ్ళీ పెంట పెంట చేసిన బాలయ్య

నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే వార్తలు మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ను బాలకృష్ణ సహా నందమూరి కుటుంబంలోని కొంతమంది అవమానిస్తున్నారని అలాగే తెలుగుదేశం పార్టీలో అతని ప్రమేయం లేకుండా పక్కన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎప్పటినుంచో హడావుడి జరుగుతూనే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2025 | 09:08 PMLast Updated on: Jan 04, 2025 | 9:08 PM

Fans Are Getting Angry That Balakrishna Has Once Again Insulted Ntr

నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే వార్తలు మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ను బాలకృష్ణ సహా నందమూరి కుటుంబంలోని కొంతమంది అవమానిస్తున్నారని అలాగే తెలుగుదేశం పార్టీలో అతని ప్రమేయం లేకుండా పక్కన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎప్పటినుంచో హడావుడి జరుగుతూనే ఉంది. 2009 ఎన్నికల్లో టిడిపి కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా మెడలో వేసుకోలేదు. ఇక అరవింద సమేత సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణతో కూడా దూరంగానే ఉంటూ వచ్చాడు.

తన తండ్రి హరికృష్ణ బతికున్నంత వరకు అప్పుడప్పుడు నందమూరి ఫ్యామిలీతో కలిసిన ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం కేవలం తన అన్న కళ్యాణ్ రామ్ తో మాత్రమే మాట్లాడుతున్నాడు. అటు నందమూరి సుహాసిని తో కూడా మంచి సంబంధాలు లేవు అనే వార్తలు షికారు చేశాయి. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ విషయంలో డోంట్ కేర్ అన్నట్లుగానే బిహేవ్ చేస్తున్నారు. దీంతో బాలకృష్ణ ఫాన్స్ కూడా ఎన్టీఆర్ ను గట్టిగానే టార్గెట్ చేశారు. దేవర సినిమా టైంలో ఎన్టీఆర్ను టార్గెట్ చేసిన వాళ్లలో నందమూరి ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

ఇక ఇప్పుడు మరోసారి బాలకృష్ణ ఎన్టీఆర్ ను అవమానించాడని ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. లేటెస్ట్ గా బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ ఆన్ స్టాపబుల్ లో జరిగింది. ఈ ఎపిసోడ్ కు.. సినిమా డైరెక్టర్ అలాగే మరి కొంతమంది వచ్చారు. ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ కి కొన్ని ఫోటోలు ప్లే చేస్తూ వాళ్ల గురించి చెప్పమని అడిగాడు బాలయ్య. అందులో వెంకటేష్ నాగచైతన్య ఫోటో ఒకటి… చిరంజీవి ఫోటో ఒకటి, అలాగే పవన్ కళ్యాణ్ ఫోటో స్క్రీన్ పై చూపించారు. బాబీ ఒక్కొక్కరితో తనకున్న అనుభవాలు వాళ్లతో సినిమా చేసిన టైంలో తనకున్న జ్ఞాపకాలు అన్నీ కూడా అక్కడ షేర్ చేసుకున్నాడు.

ఇక బాలకృష్ణ ఫోటో కూడా చూపించారు. వీళ్ళందరూ బాబీతో గతంలో సినిమా చేసిన వాళ్ళు. కానీ ఎన్టీఆర్ ఫోటో మాత్రం చూపించలేదు. ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్లో జై లవకుశ అనే సినిమా వచ్చింది. బాబీ కెరీర్ లో ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడ్డాడు. దాదాపు రెండేళ్ల పాటు ఆ సినిమా షూటింగ్ జరిగింది. అయినా సరే బాబీతో సినిమా చేసిన వాళ్లలో ఎన్టీఆర్ ఫోటో చూపించలేదు బాలకృష్ణ. దీనితో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యను టార్గెట్ చేస్తున్నారు. కచ్చితంగా సినిమా రిలీజ్ తామేంటి అనేది చూపిస్తాం అంటూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ను గతంలో కూడా ఇలాగే అవమానించారని.. అందుకే నందమూరి కుటుంబాన్ని ఎన్టీఆర్ వెంట్రుక ముక్కలా తీసి పడేసాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.