Mokshagna : బాలయ్యకు పెద్ద తలనొప్పే వచ్చిపడిందే..!
నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూపులకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలోనే జరగనుందన్న వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Fans are happy with the news that Nandamuri Natasimha Balakrishna's successor Mokshajna Terengetram will take place soon.
నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూపులకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలోనే జరగనుందన్న వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌కు వెళ్లిన బాలయ్య సైతం త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పడంతో.. మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని బాలయ్య చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారని.. అయిదారు కథలు కూడా రెడీగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ జాతకం ప్రకారం వచ్చే ఏడాదిలో ముహూర్తం ఫిక్స్ చేశాడంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నెక్ట్స్ ఇయర్ నందమూడి వంశం నుంచి మరో వారసుడి ఎంట్రీ ఖాయం అంటున్నారు. అయితే.. ఇదంతా బాగానే ఉన్నా.. ఇక్కడే బాలయ్యకు పెద్ద తలనొప్పి వచ్చి పడిందట.. తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా కోసం ఇద్దరు అక్కలు పోటీ పడుతున్నారట.. మోక్షజ్ఞతో సినిమా తీసేందుకు తేజశ్విని, బ్రాహ్మణి పోటీ పడుతున్నారట..
మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ఓ రేంజ్‌లో లాంచ్ చేయాలన్నది బాలయ్య ప్లాన్.. దాని కోసం నందమూరి నటసింహం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.. మోక్షజ్ఞ కూడా ఎంట్రీ కోసం గట్టిగానే రెడీ అవుతున్నాడు.. గతంలో బాగా బొద్దగా కనిపించిన మోక్షజ్ఞ… రీసెంట్ గా అల్ట్రా స్టైలిష్‌గా మారిపోయాడు. . ఇక.. బాలయ్య అనుకుంటే ఏ స్టార్ డైరెక్టర్ అయినా.. సై అంటూ వచ్చేస్తారు. నిర్మాతలు ఎవరైనా మేము లాంచ్ చేస్తాం అంటూ ముందుకు వస్తారు.. ఒకానొక టైమ్ లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని బాలయ్యే డైరెక్ట్ చేస్తారని టాక్ గట్టిగా వినిపించింది.. అయితే. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.. తమ్ముడిని నేను లాంచ్ చేస్తానంటే నేను లాంచ్ చేస్తానంటూ.. బాలయ్య ఇద్దరు కూతుళ్ళు పోటీపడుతున్నారట. నారా బ్రాహ్మణి, తేజస్వినీ ఈ విషయంలో పోటీపడుతున్నారట..
బాలయ్య పిల్లల్లో చిన్నకుమార్తె తేజశ్వనికి మాత్రమే ప్రస్తుతం సినీ రంగంతో అనుబంధం ఉంది. బాలయ్య సినిమా వ్యవహారాలను తేజశ్వని పర్యవేక్షిస్తుంటుంది. దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తానని ముందుకొచ్చారట తేజశ్వని. ఐతే ఆ అవకాశం తనకే ఇవ్వాలని బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి కూడా పట్టుబడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది..ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బ్రాహ్మణి ఇటీవల కాలంలో పొలిటికల్‌గానూ యాక్టివ్‌గా మారింది. ఇప్పుడు తమ్ముడి కోసం సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటోందట.. దీంతో.. ఇద్దరు కూతుళ్లలో ఎవరికి ఈ బాధ్యత అప్పగించాలా అన్నది దానిపై బాలయ్య ఎటూ తేల్చుకోలేకపోతున్నారట బాలయ్య.. మరి తన ముద్దుల కొడుకు విషయంలో బాలయ్య ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.