Pawan Kalyan: అందరి ఫ్యాన్స్ నా ఫ్యాన్సే.. వాళ్ల ఓట్లే నా ఓట్లు
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో వున్నా.. సినిమా ప్రీ రిలీజ్‌కు వచ్చినా.. స్టార్స్ ప్రస్తావన రావాల్సిందే. తన స్పీచ్‌లో ప్రతిసారీ స్టార్స్‌ను ఎందుకు తీసుకొస్తున్నాడు? సినిమా వేదికపైన కూడా పొలిటికల్‌గా ఆలోచించాడా? స్టార్స్ అభిమానులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాడా?

Fans of all the star heroes are my fans..are all the heroes equal to me and turn it into a vote bank
స్టార్స్ గురించి మాట్లాడుతూ.. రెండు విషయాలపై క్లారిటీ ఇస్తున్నాడు పవన్. ఇండస్ట్రీ అంతా ఒక్కటే.. కలిసే వున్నామని చెబుతున్నాడు. మరోవైపు.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లా డ్యాన్స్ చేయలేను.. మహేశ్ లా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు.. ప్రభాస్‌లా పాన్ ఇండియా హీరో కానంటూ తనని తాను తగ్గించుకుంటూనే.. అందరి హీరోల అభిమానం సంపాదిస్తున్నాడు పవన్. నిన్న బ్రో సినిమా ఈవెంట్లో స్టార్స్ గురించి ఇలా మాట్లాడారు.
ఇక రాజకీయ ప్రసంగాల్లో స్టార్ హీరోలందరి ప్రస్తావన తీసుకొచ్చాడు పవన్. నా హీరోలు గొప్పవాళ్లని చెప్పడానికి నాకేమీ ఇగో లేదన్నారు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని.. అందరి అభిమానుల సపోర్ట్ కావాలని కోరాడు పవన్. పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టడం ఆలస్యం. లక్షల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ పోస్ట్ ఎలా వుంటుంది? మూవీస్‌కు సంబంధించిన పోస్ట్ పెడతాడా? పాలిటిక్స్ గురించి వుంటుందా? అన్న ఆసక్తి నెలకుంది. ప్రస్తుతం సెట్స్‌పై వున్న సినిమా గురించి కాకుండా.. మరోసారి అందరి అభిమానులను కలుపుకునేలా పోస్ట్ చేసిన ప్రత్యేక వీడియో వైరల్ అయింది.
ఇన్‌స్టాలో పవన్ తొలి పోస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలతో రూపొందిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో స్టార్స్ అందరూ వుండడంతో.. పొలిటికల్‌గా అందరి హీరోలకు దగ్గరవ్వాలన్న ఐడియాను ఈసారి మాటల్లో కాకుండా వీడియోతో బయటపెట్టారు. మన బంధం ఇలాగే కొనసాగాలని.. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని అశిస్తున్నానని రాసుకొచ్చాడు. మరి ఇదంతా పొలిటికల్‌గా ఎంత కలిసొస్తుందో చూడాలి మరి.