క్లైమాక్స్ పూర్తయ్యేలోపు.. ఫ్యాన్స్ లో ఊపు… గొడెక్కిన గొడవ…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం మాట్లాడినా మొన్నటి వరకు వివాదంగానే మారింది. తను ఏదో ఈవెంట్లో ఇంకేదో స్టేట్ మెంట్ ఇచ్చినా... అది కాంట్రవర్సీ అయ్యేది... అయ్యింది కూడా... అలాంటిది సడన్ గా గొడవలు గోడెక్కేశాయి... పుష్ప 2 కొరియోగ్రాఫర్ మీద కేసు ఫైలైనా సీన్ మారలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2024 | 07:42 PMLast Updated on: Sep 25, 2024 | 7:42 PM

Fans Waiting For Devara Movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం మాట్లాడినా మొన్నటి వరకు వివాదంగానే మారింది. తను ఏదో ఈవెంట్లో ఇంకేదో స్టేట్ మెంట్ ఇచ్చినా… అది కాంట్రవర్సీ అయ్యేది… అయ్యింది కూడా… అలాంటిది సడన్ గా గొడవలు గోడెక్కేశాయి… పుష్ప 2 కొరియోగ్రాఫర్ మీద కేసు ఫైలైనా సీన్ మారలేదు. క్లైమాక్స్ కి బ్రేకులు పడలేదు… అక్టోబర్ ఎండ్ కంటే ముందే పుష్ప రాజ్ తన గెడ్డం గీసేసే టైం వచ్చేసిందంటున్నాడు… మెగా వర్సెస్ అల్లు వార్ అనుకున్నట్టే ఆగుతోందా? డిసెంబర్ రిలీజ్ టైంలో ఎలాంటి ఇబ్బందులు కూడా పుష్పరాజ్ కి అడ్డుగోడగా మారే ఛాన్స్ లేదా? ఇంతకి అంతగా ఏమైంది? ఏమౌతోంది? టేకేలుక్

పుష్ప రాజ్ గెడ్డం మాసిపోయింది. ఆ గెడ్డాన్ని రెండుమూడేళ్లుగా మేయింటేన్ చేయలేక తను పడుతున్న ఇబ్బందులకు ముగింపు పలికే టైం వచ్చింది. అక్టోబర్ 30 కంటే ముందే అంటే అక్టోబర్ 20 లోపే పుష్ప 2 షూటింగ్ పూర్తయ్యేలా ఉంది…

నిజానికి షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేని టైంలో దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి బన్నీ గెడ్డం తీశాడు. తర్వాత మళ్లీపెంచి ఇప్పుడు షూటింగ్ తో బిజీ అయ్యాడు. కాని మొన్నటి వరకు మెగా అల్లు వార్ నడిచింది. తర్వాత జానీ మాస్టర్ అరెస్ట్ తో ఓ స్పెసల్ సాంగ్ షూటింగ్ ఆగిపోయింది.

కట్ చేస్తే పుష్ప 2 పూర్తవ్వటం కష్టమన్నారు. కాని జానీ మాస్టర్ పుష్ప 2 కోసం కంపోజ్ చేసిన స్టెప్స్ జూనియర్స్ తో పూర్తి చేస్తున్నారు. ఇక క్లైమాక్స్ పెండింగ్ షూట్ అక్టోబర్ 20 లోగా పూర్తయ్యేలా ఉంది. ఎందుకో కాని సడన్ గా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ గొడవ ఆగిపోయింది.

సోషల్ మీడియా అంతా ఇప్పడు తిరుపతి లడ్డూ మీదే ఫోకస్ చేసినట్టుంది. ఏదేమైనా ఇదిలానే కొనసాగితే, పుష్ప 2 అక్టోబర్ లో పూర్తై, డిసెంబర్ 6న రిలీజ్ అవటంలో ఎలాంటి అంతరాయం ఉండేలా లేదు. ఆలోగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గొడవ పూర్తిగా చల్లారుతుంది కాబట్టి పుష్ప 2 రిలీజ్ టైంలో హైపు ఊపు పెరిగేలా ఉన్నాయి. పుష్ప 2 వాయిదా నిర్ణయం తో అన్నీ కలిసొచ్చేలా ఉన్నాయి.