మెగా మామలకు దూరం.. అక్కినేని, నందమూరి బాబులకు సలాం..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెల్లిగా మెగా మామలకు దూరమౌతూనే ఉన్నాడా..? పుష్ప 2 టైం పీరియడ్ లో రెండు కుటుంబాలకు, ఆల్ మోస్ట్ చేరుకోలేనంత దూరాలు పెరిగాయన్నారు. అలాంటి టైంలో నందమూరి ఫ్యామిలీకి బన్నీ దగ్గరయ్యాడనే కామెంట్స్ పెరిగాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెల్లిగా మెగా మామలకు దూరమౌతూనే ఉన్నాడా..? పుష్ప 2 టైం పీరియడ్ లో రెండు కుటుంబాలకు, ఆల్ మోస్ట్ చేరుకోలేనంత దూరాలు పెరిగాయన్నారు. అలాంటి టైంలో నందమూరి ఫ్యామిలీకి బన్నీ దగ్గరయ్యాడనే కామెంట్స్ పెరిగాయి. ఇప్పుడు అక్కినేని బాబులకు బన్నీ మాట సాయం మీద కూడా మిక్స్ డ్ టాక్ పెరిగింది. మెగా మామలా అందరివాడయ్యేందుకు బన్నీ ఇలా తోటి హీరోలకు, జూనియర్లకు స్నేహ హస్తం ఇస్తున్నాడా? లేదంటే మెగా మెసేజ్ ఏదో ఇచ్చేస్తున్నాడా? కాదంటే తను సాయం తీసుకోవటం కాదు, చేసే స్టేజ్ కి చేరుకున్నాడని ఇండికేట్ చేస్తున్నాడా? ఈ డౌట్లన్ని సోషల్ మీడియాలో తండేల్ పుణ్యామాని పెరిగిపోయాయి… ఆమధ్య ఆహాలో బన్నీ బిరుదు మెగాస్టార్ అని పడింది. అది బై మిస్టేక్ జరిదిందన్నారు. తర్వాత పుష్ప2 లో ఎవరు బాస్ ఎవడికి బాస్ అన్న డైలాగ్, ఓ మెసేజ్ అన్నారు.. ఇందులో ఏది నిజం? ఎందుకు తనేం చేసినా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం, కామెంట్ల రూపంలో పెరుగుతోంది? హావేలుక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎదుగుతున్నప్పుడల్లా, చరణ్ తోనో లేదంటే మెగా ఫ్యామిలీలో ఎవరి తోనైనా పోల్చటం చూశాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఎన్నోసార్లు మెగా ఫ్యామిలీకంటే కూడా మెగా హీరో బన్నీ అన్నాడు. ఓ రకంగా మెగా ఫ్యామిలీని గిల్లాలనే వర్మ అప్పడప్పుడు ఇలా అనటం చూశాం… ఐతే బన్నీ కూడా వర్మ మాటలే నిజం చేస్తున్నాడా..? తన ప్రవర్తన, అప్పుడప్పుడు తన నుంచి వచ్చే మాటల తూటాలు మెగా వ్యతిరేకతనే కనిపించేలా చేస్తోందా?
ఈ డౌట్ల కు రీజనుంది. తండేల్ టీం ని ఎంకరేజ్ చేసేందుకు బన్నీ కూడా రంగంలోకి దిగాల్సిరావటం చూస్తుంటే, బన్నీ మెల్లిగా మెగా మామను మించేలా అందరివాడిగా మారుతున్నాడనంటున్నారు. ఇదేం తప్పుకాదు. తోటి హీరోలకి మాట సాయం చేయటం నేరం కాదు. కాని కాన్విక్వెన్సేస్ మాత్రం మరోలా కనిపిస్తున్నాయి
అప్పట్లో విజయ్ దేవరకొండని తమ్ముడంటూ బన్నీ ఎంకరేజ్ చేశాడు. మెగా గ్యాప్ పెరిగిన టైంలో నందమూరి హీరోలు మరీముఖ్యంగా, నటసింహాన్ని ఆకాశానికెత్తటం లాంటి పనులు, తను కావాలనే చేశాడనంటున్నారు. ఇది కూడా తప్పు కాదు.. కాకపోతే చిరుతో తనని తాను పోల్చుకోవటం, తనలానే మిగతా వాళ్లకి స్నేహ హస్తం ఇవ్వటం, వీటన్నీంటికి తోడు తనని మించేలా పాన్ ఇండియా ఇమేజ్ తనకి ఉండటం…
ఇవే రకరకాల ఊహాగానాలకు కారణమౌతున్నాయి. గతంలో ఓ సారి ఆహాలో బన్నీ పేరుకి ముందు మెగా స్టార్ అని పెట్టడం తర్వాత అదో టెక్నికల్ మిస్టే క్ అనటం జరిగింది. అప్పట్లోనే తనని తాను మెగా స్టార్ తోపోల్చుకుంటున్నాడా బన్నీ అంటూ ఓ ప్రచారం జరిగింది. తర్వాత పుష్ప హిట్ తో తనలో ఊహించనంత మార్పొచ్చిందన్నారు. మెల్లిగా మెగాకాంపౌండ్ కి దూరం అవటమే కాదు, మెగా మామలను లెక్క చేయట్లేదనేశారు
ఇక ఏపీ ఎలక్షన్స్ టైంలో తను వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయటం మరింతగా మెగా గ్యాప్ కి ఆజ్యం పోసింది. అలా మెగా దూరం ఒక వైపు పెరుగుతుంటే అన్ స్టాపబుల్ షో లో బాలయ్యతో తన సరదా మాటలు కూడా, మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయన్నారు. దీనికి తోడు తండెల్ ప్రమోషన్ లో భాగంగా చైతన్యకి బన్నీ సపోర్ట్ కూడా రాంగ్ గానే బయట ప్రచారం జరుగుతోంది. నిజానిక మెగా ఫ్యామిలీకి, నందమూరీ కాని, అక్కినేని ఫ్యామిలీస్ తో నో ప్రాబ్లమ్. ఇంకా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీ మరీ క్లోజ్… అలాంటి వాళ్లకి బన్నీ సపోర్ట్ చేస్తే మెగా బ్యాచ్ కి పోయేదేం లేదు. మెగా ఫ్యాన్స్ కి కోపం రావాల్సిన పనిలేదు. కాని బన్నీనే మెగా గ్యాప్ ని పెంచుకుంటూ, మిగతా ఫ్యామిలీస్ కి దగ్గరౌతూ, తను కొందరి వాడనే అన్న మెసేజ్ పంపిస్తున్నాడనే ప్రచారమే కొంపముంచేలా ఉంది. అలాంటి మాటలు, కామెంట్లు సోషల్ మీడియాలో పెరిగటం షాకింగ్ గా మారింది.