రెడ్డి గారు “స్పిరిట్”లో కూడా తండ్రి సెంటిమెంటేనా…?
ఈ మధ్య కాలంలో సినిమాల్లో తండ్రి సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్ ఎక్కువగా కనపడుతోంది. ఏదోక రూపంలో తల్లి, తండ్రులపై ఉండే ప్రేమను దర్శకులు జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో తండ్రి సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్ ఎక్కువగా కనపడుతోంది. ఏదోక రూపంలో తల్లి, తండ్రులపై ఉండే ప్రేమను దర్శకులు జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ముందు వరుసలో ఉండే ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా. ఒక్కొక్కరికి ఒక్కో ఆనందం అన్నట్టు ఈ ఇద్దరికీ ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఆనందం పట్టింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చేఏడాది విడుదల అవుతుంది.
ఇక కథ ఎలా ఉంటుంది ఏంటీ అనే దానిపై పెద్ద చర్చలే ఉన్నాయి. ప్రభాస్ ను గడ్డం పెంచమని కూడా చెప్పాడని ప్రభాస్ అదే పనిలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు సందీప్ చేసిన రెండు సినిమాల్లో హీరో క్లీన్ షేవ్ లేదా ఫుల్ గడ్డంతో కనిపించాడు. ఇప్పుడు ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు అనేదే ఫ్యాన్స్ లో ఉన్న ఆసక్తి. ఇక ఈ సినిమాలో తండ్రి సెంటిమెంట్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారిన విషయం. అర్జున్ రెడ్డిలో హీరోకి తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రితో చాలా ఫ్రీగా ఉంటాడు. అలా తండ్రిపై ప్రేమను చూపించాడు.
ఇక యానిమల్ సినిమాలో అయితే తండ్రి కోసం ఢిల్లీని కూడా తగలబెట్టే వరకు వెళ్ళాడు హీరో. దీనితో ఇప్పుడు స్పిరిట్ లో ఎలా ఉంటుంది అనేది ఆసక్తిని రేపే అంశం. స్పిరిట్ సినిమాలో తండ్రి పాత్రకు మూడు పేర్లను పరిశీలిస్తున్నాడు ఈ డైరెక్టర్. ఒకటి సంజయ్ దత్, రెండు అమితాబ్, మూడు ముఖేష్ ఋషీ… ప్రభాస్ కు ఈ ముగ్గురూ అయితేనే మ్యాచ్ అవుతారని భావిస్తున్నాడు. లేదంటే కొత్త యాక్టర్ ను పరిచయం చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే సందీప్ రెడ్డి వంగా రేంజ్ మారిపోవడం ఖాయం.