పవర్ ఫ్యాన్స్ కు పండగ న్యూస్.. ఫిబ్రవరి 24కు రెడీగా ఉండండి
జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా దాదాపు 5 ఏళ్ళ నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది.

జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా దాదాపు 5 ఏళ్ళ నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. ముందు ఈ సినిమాను జాగర్లమూడి క్రిష్ డైరెక్ట్ చేయగా ఆ తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా లేట్ అవ్వడంతో సినిమా షూటింగ్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఇక సినిమాను 2023 లోనే రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2024 మార్చ్ అని కొంతమంది అన్నారు. ఇక ఇప్పుడు 2025 మార్చిలో రిలీజ్ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ కొన్ని కారణాలతో సినిమా షూటింగ్ కు ఆలస్యం అవుతున్నారు. గతంలో రాజకీయాల కారణంగా ఆయన దూరమైతే, ఇప్పుడు పరిపాలన కారణంగా దూరమవుతున్నారు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగే టైంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది. సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూడటం మానేసి… ఎప్పుడు వచ్చినా చూద్దాం అనే స్టేజ్ కి తీసుకెళ్లిపోయారు మూవీ మేకర్స్. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినిమాపై అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఇక ఇదే టైంలో మరో రెండు సినిమాలకు కూడా ఆయన సైన్ చేశారు. ఆ రెండు సినిమాలు షూటింగుకు రెడీ అవుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ పక్కాగా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా హిట్ ప్లాప్ అనేది సంబంధం లేదు. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా నుంచి ఏదైనా ట్రైలర్ గానీ పాట గానీ వస్తే చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఒక పాట ఇప్పటికే రిలీజ్ చేసారు.
లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ లుక్స్ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వాలెంటైన్స్ డే కానుకగా పవన్ కళ్యాణ్ సినిమా నుంచి అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి సెకండ్ సింగిల్ “కొల్లగొట్టి నాదిరో” అంటూ సాగే పాటను ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ పోర్షన్ కంప్లీట్ కాలేదు. మరో నాలుగు రోజులు ఆయన షూటింగ్ కి వెళ్తే ఆయన పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జ్వరంతో బాధపడటంతో షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. అటు అధికారిక కార్యక్రమాలకు కూడా పవన్ కళ్యాణ్ దూరంగానే ఉంటున్నారు. మరి అనుకున్న టైం కు రిలీజ్ చేస్తారా లేదంటే సమ్మర్ కు పోస్ట్ ఫోన్ చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయితే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు.