Fighter bookings: బాలీవుడ్ మరోసారి డీలా.. 2022 పరిస్థితులు తప్పవా..?
షారుఖ్.. పఠాన్ లాగానే.. ఫైటర్ కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరుతుందని.. హృతిక్ ఫస్ట్‌డే వంద కోట్ల వసూళ్లను సాధిస్తాడని బాలీవుడ్‌లో విపరీతమైన చర్చ నడిచింది. అయితే.. మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫైటర్ మూవీకి ఎక్స్‌పెక్ట్ చేసినంత బజ్ కనిపించడం లేదు.
Fighter bookings: హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఫైటర్. ఫస్ట్ స్టిల్ రిలీజ్ అయినప్పుడే ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. గూస్ బంప్స్ వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేశారు. పఠాన్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న ఫైటర్.. 2024 మోస్ట్ అవైటెడ్ మూవీగా జనవరి 25న బరిలో దిగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్ ఫస్ట్ లుక్‌లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
Megastar Chiranjeevi: ఫిబ్రవరి నుంచి బరిలోకి దిగనున్న మెగా విశ్వంభర
షారుఖ్.. పఠాన్ లాగానే.. ఫైటర్ కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరుతుందని.. హృతిక్ ఫస్ట్‌డే వంద కోట్ల వసూళ్లను సాధిస్తాడని బాలీవుడ్‌లో విపరీతమైన చర్చ నడిచింది. అయితే.. మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫైటర్ మూవీకి ఎక్స్‌పెక్ట్ చేసినంత బజ్ కనిపించడం లేదు. దీంతో.. బాలీవుడ్‌కు టెన్షన్ పట్టుకుంది. ఎందుకిలా జరగుతోందంటూ బాలీవుడ్ మళ్లీ డీలా పడుతోంది. కోవిడ్ సమయంలో ఇండియన్ సినిమా చాలా స్ట్రగుల్ అయ్యింది. కోవిడ్ తర్వాత పరిశ్రమ కుదురుకోవడానికి టైమ్ పట్టింది. ఇక.. 2022లో బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడూ చూడనటువంటి దారుణ పరిస్థితులను ఫేస్ చేసింది. ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడకపోవడం.. ఎన్నో హోప్స్‌తో భారీగా రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల తర్వాత చాలా ఇబ్బంది వాతావరణం నెలకొంది. అయితే.. 2023 బాలీవుడ్‌కు తిరిగి మళ్లీ మంచి జోష్ తీసుకొచ్చింది. గత ఏడాదిలో భారీ హిట్స్ వచ్చాయి. ఇక అంతా బాగానే ఉంది. 2024లో దూకుడు కొనసాగుతుంది అనుకున్నారు. కానీ.. బాలీవుడ్‌కు మళ్లీ కంగారు పట్టుకుంది. సాధారణంగా ఓ పేరు మోసిన స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే బాలీవుడ్‌లో బుకింగ్స్ మామూలు రేంజ్‌లో ఉండవు.
MAHESH BABU: 2000 కోట్ల బడ్జెట్.. రాజమౌళి-మహేశ్ సినిమాకు అంత బడ్జెటా..?
కానీ ఇప్పుడు హృతిక్ రోషన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ లాంటి సెన్సేషనల్ కాంబినేషన్ నుంచి వస్తున్నా “ఫైటర్” చిత్రానికి ఏమంత గొప్ప బజ్ కనిపించకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. మళ్లీ సీన్ వెనక్కి వస్తోందా అన్న టెన్షన్ మొదలైంది. ఫైటర్ మూవీకి హిందీ మార్కెట్‌లో చాలా తక్కువ బుకింగ్స్ మాత్రమే కనిపిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా షారుఖ్ నటించిన డంకి చిత్రానికి కూడా ఇదే రిస్థితి నెలకొంది. రెండు భారీ హిట్స్ కొట్టినప్పటికీ డంకికి మాస్ సినిమా రేంజ్ బుకింగ్స్ పడలేదు. భారీ యాక్షన్ సినిమా అయిన ఫైటర్‌కు ఇప్పుడు ఇదే పరిస్థితి ఫేస్ చేయడం బాలీవుడ్‌ను నిరాశలో పడేసింది. బుకింగ్స్ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మూవీ రిలీజ్ అయ్యాక కలెక్షన్ల పరిస్థితి ఏంటా అన్న డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి.. మున్ముందు ఏం జరగబోతోందన్నది మూవీ రిలీజ్ అయ్యాక తర్వాతనే తెలుస్తుంది.