FIGHTER MOVIE: ఓటీటీలోకి ఫైటర్.. ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ అంటే..
తెలుగులోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య, ఫైటర్ సినిమా భారీ అంచనాల మధ్య, రిపబ్లిక్ డేకు ఒక్క రోజు ముందు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.
FIGHTER MOVIE: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్. గత జనవరి 26న విడుదలైన ఈ చిత్రం దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. అంటే.. మార్చి 21 నుంచి ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
GAME CHANGER: ఓటీటీ సంస్థ చేసిన పనికి అసలు కథే లీకై పోయిందా..?
తెలుగులోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య, ఫైటర్ సినిమా భారీ అంచనాల మధ్య, రిపబ్లిక్ డేకు ఒక్క రోజు ముందు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలు ప్రేక్షకుల్ని కొంతవరకు మెప్పించాయి. యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్‍ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. అయితే, విమానాలపై అవగాహన లేకపోవడం వల్లే.. జనాలకు ఈ సినిమా అంతగా అర్థం కాలేదని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, సినిమా వసూళ్లు నెమ్మదిగా పుంజుకున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.337 కోట్లు రాబట్టి, కమర్షియల్‍గా సక్సెస్ సాధించింది.
ఈ చిత్రంలో హృతిక్‌తోపాటు దీపికా పదుకొనె, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషించారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, అజిత్ అంధారే, అంకూ పాండే, రామోన్ చిబ్, కెవిన్ వాజ్ ఫైటర్ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.