Fighter Review: ఆకాశంలో ఫైట్స్.. ఫైటర్ మెప్పించిందా..?

సిద్దార్థ్ ఆనంద్ మూవీ అంటే అంచనాలు ఆకాశాన్నంటాలి. అదే జరిగింది. కాని ప్రీ అడ్వాన్స్ బుక్కింగ్స్ యావరేజ్‌గా ఉన్నాయి. రిలీజ్ అయ్యాక పరిస్థితి కాస్త మారినట్టుంది. హృతిక్‌తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి రెండు హిట్లిచ్చిన సిద్దార్థ్ ఆనంద్.. ఫైటర్‌తో హ్యా్ట్రిక్ ప్లాన్ చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2024 | 06:05 PMLast Updated on: Jan 25, 2024 | 6:05 PM

Fighter Review Hrithik Roshan And Deepika Padukone Soar In This Aerial Actioner

Fighter Review: హృతిక్ రోషన్ అంటేనే బాలీవుడ్‌లో హాలీవుడ్ లుక్కున్న స్టార్. తనని గ్రీక్ గాడ్ అని కూడా అంటారు. ఇక బాలీవుడ్ నెంబర్ వన్.. గ్లామరస్ లేడీ దీపికా పదుకొనే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో.. పటాన్ హిట్‌తో దూసుకొచ్చిన సిద్దార్థ్ ఆనంద్ మూవీ అంటే అంచనాలు ఆకాశాన్నంటాలి. అదే జరిగింది. కాని ప్రీ అడ్వాన్స్ బుక్కింగ్స్ యావరేజ్‌గా ఉన్నాయి. రిలీజ్ అయ్యాక పరిస్థితి కాస్త మారినట్టుంది. హృతిక్‌తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి రెండు హిట్లిచ్చిన సిద్దార్థ్ ఆనంద్.. ఫైటర్‌తో హ్యా్ట్రిక్ ప్లాన్ చేసుకున్నాడు.

KAMAL HAASAN: కమల్ హాసన్‌కి ఎన్టీఆర్ సాయం..

మరి ఆ కల నెరవేరిందా అంటే.. కథలో కాలుపెట్టాల్సిందే. ఫైటర్ కథ వెరీ సింపుల్. మనదేశం మీద శత్రు దేశమైన పాక్ పన్నాగాలు, టెర్రరిస్టుల ఎటాక్స్‌ని ఎదుర్కొనేందుకు ఓ స్పెషల్ టీం ఫాం చేస్తారు. ఆ టీంలో హీరో ఉంటాడు. ఏయిర్ ఫోర్స్‌లో ఈ స్పెషల్ టీం ఎలా టెర్రరిస్టులను ఎదుర్కొంది..? పాక్ పన్నాగాలు ఎలా చిత్తు చేసిందనేదే సింపుల్‌గా సినిమా కథ. సిద్దార్థ్ ఆనంద్ ఏ మూవీ తీసినా అందులో పెద్దగా కథంటూ ఏది ఉండదు. ఆర్డినరీ స్టోరీకి ఎక్స్ ట్రా ఆర్డినరీ మేకింగ్ జోడించి సినిమా స్థాయిని పెంచుతాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. మేకింగ్ మ్యాజిక్ చేస్తోంది. కాని మ్యూజిక్కే షాక్ ఇస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్‌తోపాటు సాంగ్స్ జస్ట్ యావరేజ్. ఒక్క వందేమాతరం సాంగ్ మినహా అన్నీ సోసోగానే ఉన్నాయి.

కథ కూడా యావరేజే. ఎటొచ్చీ.. మేకింగ్, ఆకాశంలో జెట్ ఫైటర్ల యుద్దం, వాటితో పాటు హృతిక్ పెర్పామెన్స్ సినిమాకు కలిసొచ్చాయి. ఓవరాల్‌గా ఫైటర్ మూవీకి పాస్ మార్కులే పడ్డాయి. కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే.. సిద్ధార్థ్ గత చిత్రం పఠాన్‌లాగా మరీ సంచనాలైతే నమోదు చేయకపోవచ్చు.